Begin typing your search above and press return to search.
సొంత మనుషులే పవన్ కు దూరమౌతున్నారా?
By: Tupaki Desk | 8 Jan 2019 1:25 PM ISTపవన్ మొదట్నుంచి అందరివాడు కాదు. కేవలం కొందరి వాడు మాత్రమే. ఒక దశలో మెగా కాంపౌండ్ కు కూడా దూరమైన వ్యక్తి పవన్. ఎందుకంటే పవన్ వ్యక్తిత్వం అలాంటిది. ఏదీ ఆశించకుండా ఉంటేనే పవన్ తో సుఖం. లేదంటే అన్నీ కష్టాలే. మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత పవన్ ఇలా చాలా మందిని దూరం చేసుకుంటున్నారు. దీనికి తాజా ఉదాహరణ అలీ.
అలీ-పవన్ వేరువేరు కాదు. రెండు శరీరాల్లో ఉన్న ఒకటే ఆత్మ. ఇండస్ట్రీలో అది వీళ్ల అనుబంధం. అలాంటి అలీ కూడా రాజకీయంగా పవన్ కు దూరమయ్యాడంటే పవన్ ఆలోచన విధానం - తెర వెనక అతడి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. అవును.. పొలిటికల్ గా పవన్ చాలా టఫ్ అనేది అలీ మాట. అందుకే పవన్ అంటే ఇష్టమున్నప్పటికీ జనసేనతో తను కలిసి ప్రయాణించడం లేదని స్పష్టం చేశాడు ఈ హాస్యనటుడు.
రాజకీయాల్లోకి ఎవరూ నిస్వార్థంగా రారు. కేవలం ప్రజాసేవకే అంకితమై రాజకీయంలోకి అడుగుపెట్టరు. అలీ కూడా అంతే. ఈసారి ఎన్నికల్లో దిగితే కచ్చితంగా గెలవాలి - సేమ్ టైమ్ ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవి కూడా దక్కించుకోవాలి. అది అలీ టార్గెట్. జనసేనలోఉంటే ఇది సాధ్యం కాదు. పవన్ దగ్గర కొర్రీలు పనికిరావు. అందుకే జనసేనకు - పాక్షికంగా పవన్ కు దూరమయ్యారు అలీ.
కేవలం అలీ మాత్రమే కాదు.. బండ్ల గణేశ్ - మాధవీలత కూడా ఇంతే. ఏదో ఆశిస్తే అది జనసేనలో జరగదు. పవన్ ముక్కుసూటితనం ముందు వీళ్ల రాజకీయాలు చెల్లవు. అందుకేతనకు దేవుడైనప్పటికీ రాజకీయాల్లో పవన్ ను శత్రువుగానే చూశాడు బండ్ల గణేశ్. తిన్నగా వెళ్లి కాంగ్రెస్ లో చేరాడు. అటు మాజీ హీరోయిన్ మాధవీలత కూడా పవన్ తన ఫేవరెట్ అంటూనే వెళ్లి బీజేపీలో చేరింది.
సో.. ఓ నటుడిగా - వ్యక్తిగా పవన్ వీళ్లందరికీ కావాలి. కానీ ఓ రాజకీయ నాయకుడిగా మాత్రం పవన్ వీళ్లకు పనికిరాడన్నమాట. పవన్ వ్యవహారశైలి ఇలా ఉంటే - రేపు ఎన్నికల్లో మెగా కాంపౌండ్ నుంచి జనసేనాని కోసం ఎంతమంది బయటకొస్తారో చూడాలి.