Begin typing your search above and press return to search.
ఏపీలో ముందస్తు ఎన్నికలకు ప్రధాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?
By: Tupaki Desk | 31 Dec 2022 7:35 AM GMTఏపీలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. 175కి 175 సీట్లు సాధించాలనే కృతనిశ్చయంతో వైసీపీ ఉంది. టీడీపీ, జనసేన–బీజేపీ సైతం విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ దిశగా అన్ని పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. తమ అస్త్రశస్త్రాలకు పదునుపెడుతున్నాయి.
మరోవైపు ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన నమ్ముతున్నాయి. వైసీపీ ప్రభుత్వం పైన ప్రజల్లో అంతకంతకూ వ్యతిరేకత పెరుగుతున్నాయని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా పూర్తిగా దిగజారిందని.. సంక్షేమ పథకాలను కూడా జగన్ కొనసాగించలేరని అంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా 2 లక్షల మందికిపైగా పెన్షన్ లను తొలగిస్తున్నారని చెబుతున్నాయి.
తమ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ భావిస్తోందని ప్రతిపక్షాలు బలంగా విశ్వస్తిన్నాయి. వాస్తవానికి 2024 వేసవిలో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్, రాజధాని అంశం ఇలా కీలక అంశాలన్నీ ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఉండటంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని ప్రతిపక్షాలు విశ్వసిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయమని నమ్ముతున్నాయి.
తాజాగా సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో చర్చించారని అంటున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్/అక్టోబర్ లో ముందస్తు ఎన్నికలకు వెళ్తామని జగన్ వారికి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఎన్నికల కోసం జగన్ అసెంబ్లీని రద్దు చేసినా ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలనేది కేంద్ర ఎన్నికల సంఘం ఇష్టం.
ఈ నేపథ్యంలో కేంద్రం మద్దతు లేకుండా వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం సాధ్యం కాదు. అయితే మొదటి నుంచి అన్నీ విషయాలు తమ మద్దతు అడిగినా, అడగకపోయినా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అన్ని విధాల వైసీపీ మద్దతు ప్రకటిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ముందస్తు ఎన్నికలకు వెళ్తామని.. ఇందుకు కేంద్రం ఒప్పుకోవాలని.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జగన్ బీజేపీ పెద్దలను కోరినట్టు ప్రచారం సాగుతోంది.
ఇందుకు బీజేపీ పెద్దలు కూడా అంగీకరించినట్టు సమాచారం. జగన్ కూడా ముందస్తు ఎన్నికల నేపథ్యంలోనే ఆరు నెలల ముందుగానే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులను గడప గడపకు పంపుతున్నారు. ఈ కార్యక్రమం జనవరితో పూర్తయిపోతుంది.
మరోవైపు ప్రతి 50 ఇళ్లకు వలంటీర్ల తరహాలో గృహ సారథులను కూడా నియమించుకోవాలని జగన్ తమ పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే సచివాలయానికి ముగ్గురు కన్వీనర్లను నియమించుకుని పార్టీని క్షేత్ర స్థాయి నుంచే బలోపేతం చేయాలని కోరారు. అలాగే నియోజకవర్గానికి 50 మంది చొప్పున కార్యకర్తలను ఎంపిక చేసి నియోజకవర్గ సమీక్షలను నిర్వహిస్తున్నారు. దీంతో జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నింటినీ చేపడుతున్నారని అంటున్నారు.
సీఎం వైఎస్ జగన్ తాజా ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో కీలక చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ముందుగా ఏపీ అసెంబ్లీని ఎప్పుడు రద్దు చేయాలి, ముందస్తు ఎన్నికలకు ఎప్పుడు వెళ్లాలనే దానిపై చర్చించినట్లు ఢిల్లీ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.
దీంతో అసెంబ్లీ రద్దుతోపాటు ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జగన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత ఏపీ అసెంబ్లీ రద్దు చేసేందుకు సీఎం జగన్ కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది వేసవిలో బడ్జెట్ ప్రవేశపెడతారని.. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. అలాగే పలు కొత్త పథకాలను కూడా ప్రవేశపెడతారని అంటున్నారు. ఆ తర్వాతే ముందస్తు ఎన్నికలకు వెళ్తారని పేర్కొంటున్నారు. ఈ లెక్కన వచ్చే ఏడాది అక్టోబర్, నవంబర్ సమయంలో ముందస్తు ఎన్నికలు ఉంటాయని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.