Begin typing your search above and press return to search.
మోడీ అంటే.. యోగా గురువుకు మండుతుందా?
By: Tupaki Desk | 26 Dec 2018 11:06 AM GMTకొందరు కొన్ని మాత్రమే చేస్తారన్న ఫీలింగ్ ను తుడిచి పెట్టేలా చేసిన వ్యక్తుల్లో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ఒకరు. యోగా పాఠాలు చెప్పే ఆయన.. దేశీయ కార్పొరేట్ రంగాన్నే కాదు.. అంతర్జాతీయంగా మొనగాళ్లు లాంటి కాల్గేట్.. యూనిలీవర్.. పీ అండ్ జీ లాంటి కంపెనీలకు ముచ్చమటలు పోసేలా వ్యాపారం చేయటం తెలిసిందే. అతి తక్కువ వ్యవధిలో ఎఫ్ ఎం సీ జీ మార్కెట్లో పాగా వేసిన ఆయన తీరు సంచలనమైన సంగతి తెలిసిందే.
మొదట్నించి మోడీ అంటే సానుకూలంగా ఉండే ఆయన.. 2014 సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ తరఫున.. మోడీని ప్రధాని చేయాలన్న ఉద్దేశంతో ఎంతలా కష్టపడింది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి ఆయన తాజాగా మోడీ పై తనకున్న అసంతృప్తిని తన మాటలతో చెప్పి సంచలనం సృష్టించారు. దేశీయంగా ఇప్పటికే మోడీ మీద అసంతృప్తి అంతకంతకూ పెరుగుతుందన్న మాటతో పాటు.. ఇటీవల వెల్లడైన మూడు రాష్ట్రాల ఫలితాలు మోడీ మీద పెరుగుతున్న అసంతృప్తికి సంకేతాలుగా విశ్లేషిస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలాన్ని రేపుతున్నాయి.
భవిష్యత్తులో దేశాన్ని పాలించే ప్రధాని ఎవరంటూ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఆ విషయాన్ని చెప్పలేమంటూ మధురైలో వ్యాఖ్యానించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాను ఏ పార్టీకి కానీ.. ఏ వ్యక్తికికాని మద్దతు ఇవ్వనని స్పష్టం చేశారు. తాను రాజకీయాల వైపు దృష్టి సారించటం లేదని.. భారత్ ను హిందూదేశం చేయాలని లేదని.. అధ్యాత్మికంగా దేశంలో యోగా.. వైదిక్ ధర్మాలను ప్రచారం చేయటమే తన లక్ష్యంగా చెప్పుకున్నారు.
మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. కాబోయే ప్రధాని ఎవరన్న మాటకు మోడీ పేరు చెప్పకుండా.. ఏమీ చెప్పలేమని చెప్పటం చూస్తుంటే.. రానున్న రోజుల్లో మోడీని గతంలో మద్దతు ఇచ్చిన వారంతా ఎవరికి వారు తప్పుకోవటం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఒకటి తర్వాత ఒకటిగా మోడీకి వ్యతిరేక సంకేతాలు వెలువడటం దేనికి సంకేతం?