Begin typing your search above and press return to search.
ఈ టైంలో శృంగారం తగ్గిందా? పెరిగిందా?
By: Tupaki Desk | 28 May 2021 3:30 AM GMTకరోనా లాక్ డౌన్ టైంలో అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. బయట అంతా నిషేధాజ్ఞలు ఉండడంతో తెలంగాణలో ఉదయం 10 తర్వాత.. ఏపీలో 12 గంటల తర్వాత బయటకు వెళితే పోలీసుల చెడుగుడు ఆడేస్తారు. అయితే ఇంట్లోనే ఉంటే జంటలు శృంగార లోగిళ్లలో మునిగిపోతారని అనుకుంటే పొరపాటే. ఆఫీసులు, పని ఉన్నప్పటి కంటే ఇప్పుడే శృంగారం వాంఛలు, శృంగార అనుభూతులు తగ్గిపోయిందని తాజా సర్వేలో తేలింది.
ముంబైకి చెందిన ఓ సర్వే సంస్థ తాజాగా కరోనా లాక్ డౌన్ వేళ శృంగారం తగ్గిందా ? పెరిగిందా? అని సర్వే చేస్తే ఉమ్మడి కుటుంబాల్లో తగ్గిపోయిందని.. కేవలం ఇద్దరు మాత్రమే సపరేట్ గా ఉండే జంటల్లో మాత్రమే మోస్తారుగా ఉందని తేలింది.
కరోనా లాక్ డౌన్ తో ఇప్పుడు కుటుంబమంతా ఒకే ఇంట్లో కలిసి ఉండాల్సిన పరిస్థితులున్నాయి. ఓవైపు ఉద్యోగాలు లేక ఆర్థిక ఇబ్బందులు.. ఇంట్లో బండెడు చాకిరీతో మహిళలు అలిసిపోవడాలు.. అలకలు కోపాతాపాలతో ఉమ్మడి కుటుంబాల్లో గొడవలు ఎక్కువై శృంగార తాపాలు తగ్గిపోయాయని తేలింది.
ఇక ఇద్దరు మాత్రమే ఉండే జంటలు చాలా అరుదు. అది కొత్తగా పెళ్లయిన వారు లేక.. బడాబాబుల కుటుంబాల్లోని జంటలు మాత్రమే ప్రైవసీ కోసం ఈ టైంలో ఒంటరిగా కాపురం ఉంటున్నారు. వారు మాత్రమే సరదాగా శృంగారంలో మునిగితేలుతున్నారని తేలింది. అయితే ఈ సమయంలో గర్భం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా వేళ బెడ్స్ ఖాళీ లేని వేళ ప్రెగెన్సీ కాన్పులు అంటేనే కొత్త జంట భయపడుతున్న పరిస్థితి నెలకొంది.మొత్తంగా ఈ టైంలో శృంగార వాంఛ మునుపటితో పోలిస్తే తగ్గిందని సర్వేలో తేలిందట..