Begin typing your search above and press return to search.
మోడీని కంట్రోల్ చేసే ఓఎస్ ను సోనియా గుర్తించేశారా?
By: Tupaki Desk | 20 April 2021 3:13 AM GMTప్రధాని నరేంద్ర మోడీ ఉక్కులాంటి ధృడమైన మనిషి. డెబ్భై ఏళ్ల వయసులో ఆయన ఎంత హుషారుగా ఉంటారో.. మరెంత చురుగ్గా ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అన్నింటికి మించి.. ఆయన మానసిక స్థైర్యం చాలా ఎక్కువ. ఒత్తిళ్లను చిటికెన వేలుతో హ్యాండిల్ చేస్తారు. అంత సామర్థ్యం ఉంది కాబట్టే.. దాయాది పాకిస్థాన్ తాట తీయటమే కాదు.. అయోధ్య ఎపిసోడ్ ను ఒక కొలిక్కి తీసుకురావటంతో పాటు.. పెద్ద నోట్ల రద్దు.. ఆర్టికల్ 370ను నిర్వీర్యం చేయటం..ఇలా ఒకటా.. రెండా తన పాలనలో ఎవరూ మర్చిపోలేని విధివిధానాల్ని తేవటంలో సక్సెస్ అయ్యారు.
ఇంత చేసిన ఆయన్ను.. అర్థం చేసుకోవటంలోనూ.. ఆయన్ను ఇరుకుపెట్టేలా.. ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లోని లోటుపాట్లను ఎత్తి చూపటంలో శతాధిక వయసున్న కాంగ్రెస్ కు సైతం ఒక పట్టాన వంట పట్టని పరిస్థితి. ఈ కారణంతోనే.. ఏడేళ్ల తన పాలనను ఏ విపక్ష పార్టీ కానీ.. మరే పార్టీ అధినేత కానీ వేలెత్తి చూపించలేకపోయారు. ఇలాంటి క్రెడిట్ మోడీకి మాత్రమే చెల్లుతుంది. అదానీ.. అంబానీ లాంటి బాణాలు చీకట్లో వేసినట్లుగా మారాయే తప్పించి.. సూటిగా ఏ ఒక్కటి తగిలింది లేదు.
కరోనాకు కాస్త ముందు ఢిల్లీలో హడావుడి జరిగినా.. లాక్ డౌన్ పుణ్యమా అని ఎవరికి గుర్తుకు రాకుండా పోయింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసన వేళ.. కొంత ఉక్కిరిబిక్కిరి అయినప్పటికీ.. దాన్ని విజయవంతంగా సైడ్ ట్రాక్ పట్టించే విషయంలోనూ మోడీ విజయం సాధించారనే చెప్పాలి. రెండో దఫా ప్రధాని అయిన తర్వాత వరుస సవాళ్లు ఎదురవుతున్నా.. అదరక.. బెదరక ముందుకు సాగే మోడీని ఆత్మరక్షణలో పడేయటం అత్యాశే అవుతుంది. ఇక.. ఆయన్ను ఫలానా విషయంలో ఫలానా నిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చి ఒప్పించటం అంత తేలికైన విషయం కాదు.
ఈ విషయంలో కాంగ్రెస్ ఇటీవల వరుస సక్సెస్ లు సాధిస్తోంది. సీబీఎస్ఈ పదోతరగతి పరీక్షల్ని రద్దు చేయించే విషయంలో.. వ్యాక్సిన్ ను 18 ఏళ్లకు పైబడిన వారందరికి టీకా వేసేలా మోడీ నిర్ణయం తీసుకోవటంలో సోనియా సక్సెస్ అయ్యారని చెప్పాలి. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వారం.. పది రోజుల వ్యవధిలో రెండు అంశాల్లో కాంగ్రెస్ చేసిన డిమాండ్ కు తలొగ్గక తప్పలేదు. ఎప్పుడూ.. ఏ సందర్భంలోనూ వంగని మోడీ చేత.. తమ డిమాండ్లను అమలు చేసేలా చేయటంలో సోనియా విజయాన్ని మర్చిపోలేం. మొత్తంగా మోడీ ఓఎస్ ను మొదటిసారి విజయవంతంగా క్రాక్ చేయటంలో సోనియా సక్సెస్ అయినట్లేనని చెప్పక తప్పదు.