Begin typing your search above and press return to search.

బీజేపీ గేమ్ మొదలైందా?

By:  Tupaki Desk   |   22 Feb 2022 5:30 PM GMT
బీజేపీ గేమ్ మొదలైందా?
X
విమ‌ర్శ‌ను ఒప్పుకోని, ఒప్పుకోలేని నైజంలో ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ఉంది. విమ‌ర్శ‌తో పాటు క‌ఠినం అయిన వాస్త‌వాల‌ను కూడా అంగీక‌రించ‌ని, అంగీక‌రించ‌లేని స్థితిలో ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ఉంది. ఏడేళ్ల ఎన్డీఏ హ‌యాంలో రాష్ట్రాల‌కు ద‌క్కింది ఏంటి? అన్న‌ది కేసీఆర్ పాయింట్. ఇదే ఇప్పుడు కేంద్రం కోపానికి కార‌ణం అవుతోంది.

ఆ రోజు కూడా దాదాపు ఇలాంటి ప్ర‌శ్నే టీడీపీ కూడా వేసింది. త‌రువాత ఏమ‌యిందో అంద‌రికీ తెలిసిందే. అస‌లు జ‌గ‌న్ ఎందుకు పోరాడ‌లేక‌పోతున్నారంటే అందుకు కార‌ణం కూడా రేప‌టి వేళ క‌క్ష్య సాధింపు చ‌ర్య‌లేవయినా బీజేపీ చేప‌డుతుందేమో అన్న భ‌యం.

ఇప్పుడిదే నిజం కానుందని, త్వ‌ర‌లో కేసీఆర్ అరెస్టు ఉంటుందని, ఆ రోజు జ‌గ‌న్ అరెస్టు అయిన విధంగానే ఇప్పుడు కేసీఆర్ కూడా అక్ర‌మాస్తుల కేసులు కానీ మ‌నీ ల్యాండ‌రింగ్ కానీ ఏదో ఒక కేసు న‌మోదు కావ‌డం ఖాయం అని అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర స‌మితికి ఉద్య‌మ కాలం నుంచి విదేశాల నుంచి క‌ట్ట‌డి లేకుండా నిధులు వ‌చ్చాయ‌న్న ఆరోప‌ణ‌లూ ఉన్నాయి. దేశంలో 300 కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఆస్తులున్న సంప‌న్న పార్టీ తెలంగాణ రాష్ట్ర స‌మితి. ప్రాంతీయ పార్టీల‌లో ఆస్తుల విష‌య‌మై ఇదే నంబ‌ర్ ఒన్ పార్టీ. ఉప ప్రాంతీయ పార్టీగా పేరున్న తెలంగాణ రాష్ట్ర స‌మితి ఒక‌ప్పుడు ఉద్య‌మ పార్టీ అన్న సంగ‌తి మ‌రువకూడ‌దు.

ఉద్య‌మ కాలంలో ఇబ్బడిముబ్బ‌డిగా ప్ర‌వాస భార‌తీయులు (తెలంగాణ‌కు చెందిన‌) నిధులు ఇచ్చారు. వాటి అన్నింటిపై కూడా వివ‌రాలు లాగేందుకు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు సిద్ధం అయ్యేందుకు వీలుంది. అదేవిధంగా ఇప్ప‌టి హైద్రాబాద్ తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణం అందుకు పోగేసిన నిధులపై కూడా కేంద్రం వివ‌రాలు ఆరా తీసేందుకు అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. వీటితో పాటు కేసీఆర్ ఇత‌ర ఆస్తులు, కేంద్ర మంత్రిగా ఉన్న‌ప్పుడు చేసిన త‌ప్పిదాలు వీట‌న్నింటినీ కూడా త‌వ్వి తీసేందుకు ఉన్న ఏ ఒక్క అవ‌కాశాన్నీ కేంద్రం జార‌విడుచుకోదు అన్న‌ది వాస్త‌వం.

ఇవ‌న్నీ కేసీఆర్ మెడ‌కు చుట్టుకునే వివాదాలే..! వీటితోపాటు తెలంగాణ ఏర్పాట‌య్యాక కేసీఆర్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క రీతిలో మెఘా కంపెనీకి కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప‌నులు అప్ప‌గించారు. వీటిపై కూడా కేంద్రం ఫోక‌స్ చేయ‌నుంద‌ని సమాచారం.

యాదాద్రి అభివృద్ధి సంబంధిత ప‌రిహారాల చెల్లింపుల్లో కూడా కొన్ని అవ‌క‌త‌వ‌క‌లు ఉన్నాయ‌ని విప‌క్ష స‌భ్యుల అభియోగం. అవి కూడా వెలుగులోకి వ‌స్తాయి. ఇవే కాకుండా ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణం ఆగిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఇవ‌న్నీ జ‌రిగే అవ‌కాశాలుంటే కేసీఆర్ కు జ‌గ‌న్ మాదిరిగానో చంద్ర‌బాబు మాదిరిగానో, కేజ్రీ వాల్ మాదిరిగానో ప్ర‌శ్నించిన పాపానికి లేదా ప్ర‌శ్నించే సాహ‌సం చేసినందుకు కొత్త చిక్కులు ఎదురుకాక త‌ప్ప‌వు.