Begin typing your search above and press return to search.
ఏపీలో మార్పు మొదలైందా? పచ్చ మీడియా హైప్ చేస్తుందా?
By: Tupaki Desk | 12 Jan 2023 12:30 AM GMTఏపీలో ఏం జరుగుతుంది? ఏపీ రాజకీయాల్లో కీలక మార్పు మొదలైందా? ఇప్పటివరకు తిరుగులేని అధిక్యతను ప్రదర్శించిన ఏపీ అధికారపక్షం.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడిందా? మొన్నటివరకు తమకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు.. తమ రోటీన్ తీరుకు భిన్నంగా ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారా? ఆ మధ్యన అదే పనిగా నోటికి పని చెప్పే అలవాటున్న అతి నేతలుగా ముద్ర పడిన కొడాలి నాని.. వల్లభనేని వంశీ.. పేర్ని నాని లాంటి వారిలో మార్పు కనిపిస్తోందని.. రానున్న రోజుల్లో మరింత మారే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.
ఎందుకిలా? అన్న ప్రశ్నకు.. వైసీపీ మీద ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్న మాట సమాధానంగా వస్తోంది. అయితే.. ఈ మాటలో నిజం ఎంత? వాస్తవానికి దగ్గరగా ఉందా? లేదంటే బాబు అండ్ కో..లేదంటే వైసీపీ వర్గాలు తరచూ పేర్కొనే పచ్చ మీడియా ప్రదర్శిస్తున్న టక్కుటమార విద్యలతో ఇలాంటి సీన్ కనిపిస్తుందా? అన్నది మరో ప్రశ్న. జగన్ మూడున్నరేళ్ల పాలనలో ప్రజలు విసిగిపోయారని.. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం దూసుకెళుతున్న తీరుతో వారిలో ఆత్మశోధన మొదలైనట్లుగా కొందరు చెబుతున్నారు.
మరికొందరి మాటేమో.. పిల్లిని గదిలో పడేసి కొట్టటం ఒక స్థాయి వరకు మాత్రమే సాధ్యమని.. ఆ తర్వాతి అది కూడా తిరగబడుతుందన్న మాటను ప్రస్తావిస్తూ.. విపక్షాల విషక్షంలో అధికారపక్షం వ్యవహరించిన తీరుతో ప్రజలు వెగటు చెందారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు 'బటన్' నొక్కటం ద్వారా అందచేస్తున్న జగన్మోహన్ రెడ్డి వారికి కావాల్సినవన్నీ చూస్తున్నప్పుడు.. ఆలోచించాల్సిన అవసరం ఏముంది? అన్న ప్రశ్న వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
ఇక్కడ వారంతా మర్చిపోతున్న విషయం ఏమంటే.. కాలే కడుపు దాన్ని నింపుకోవటం మీదనే ఆలోచిస్తుంది. కడుపు నిండిన తర్వాత.. మరింకేం కావాలన్న విష్ లిస్టు మెదడులోకి వస్తుంది. సంక్షేమపథకాల వరకు బాగానే ఉన్నా.. పోలీసుల ధోరణి.. వైసీపీ నేతలు.. కార్యకర్తల అతి అంతకంతకూ ఎక్కువ కావటం.. అధికారం ప్రజల భిక్ష అనే కన్నా.. తమ హక్కు అన్నట్లుగా వారి తీరు ఉందని అదే ఇప్పుడు కొంప ముంచే వరకు వెళుతుందన్న మాట వినిపిస్తోంది.
దీనికి తోడు.. చంద్రబాబు.. పవన్ మధ్య దూరం పెంచేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావటం.. వారిద్దరు దగ్గరవుతున్న తీరు.. వైసీపీ వ్యతిరేక శక్తులన్ని ఒకటయ్యేలా మారటమే తాజా మార్పుగా చెబుతున్నారు. మొన్నటి వరకున్న సందేహాలు ఈ మధ్యన పటాపంచలు కావటంతో పాటు.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ.. జనసేన కలిసి పోటీ చేస్తాయన్న విషయంపై క్లారిటీ రావటంతో కొత్త ఉత్సాహం పొంగిపొర్లుతుందని చెప్పక తప్పదు.
గెలుపు ధీమా మనిషి ఆలోచనల్లో మార్పు తీసుకురావటం తెలిసిందే. ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది. దీనికితోడు.. బాబు.. పవన్ లు ఇద్దరు ఇచ్చిపుచ్చుకునే ధోరణిని ప్రదర్శిస్తున్న వైనం..
అధికారాన్ని సొంతం చేసుకోవటానికి ఈ పరిణామం అనివార్యమని భావిస్తున్న వారంతా ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదిలా ఉంటే.. డెబ్బైఏళ్ల వయసులో చంద్రబాబు ప్రదర్శిస్తున్న పోరాట పటిమ టీడీపీ నేతల్లో కంటే క్యాడర్ లో కొత్త స్ఫూర్తిని రగిలించేలా చేస్తోంది. అదే ఇప్పటి మార్పుకు ఒక కారణంగా చెబుతున్నారు. గత మూడున్నరేళ్లలో కనిపించని మార్పు.. కొత్త ఉత్సాహం గడిచిన రెండు నెలల కాలంలో కొట్టొచ్చినట్లుగా ఉందన్న అభిప్రాయం పలువురి నోట వినిపిస్తోంది. ఇది అంతకంతకూ ఎక్కువ అయ్యే కొద్దీ.. ఏపీ అధికారపక్షానికి కొత్త సవాళ్లు ఎదురవుతాయని చెప్పాలి. మరి.. ఆ వేళలో జగన్ ఏం చేస్తారన్నదే భవిష్యత్తు రాజకీయం అవుతుందని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.