Begin typing your search above and press return to search.

ఏపీలో క్రైం రేటు తగ్గిందా? ఏంటి కారణం..?

By:  Tupaki Desk   |   29 Dec 2022 12:30 PM GMT
ఏపీలో క్రైం రేటు తగ్గిందా? ఏంటి కారణం..?
X
జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొత్తలో వరుస క్రైంలు చోటుచేసుకున్నాయి. క్రైం రేటు బాగా పెరిగింది. హత్యలు, అత్యాచారాలు జరిగాయి. ఆలయాలపై ధ్వంసాలు చోటుచేసుకున్నాయి. అయితే జగన్ సర్కార్ పటిష్ట చర్యలతో ఇప్పుడు క్రైం రేటు తగ్గిపోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.

2022 సంవత్సరంలో ఏపీలో క్రైం రేటు తగ్గిపోయింది. ఈ విషయాన్ని మేం ఎప్పుడు లేదు. ఆ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. గతేడాది కంటే ఈ సంవత్సరం 60 వేల కేసులు తక్కువగా నమోదయ్యాయని ఆయన వివరించారు. పోలీసులు పటిష్టమైన చర్యలతోనే క్రైం రేటు తగ్గిందని ఆయన చెప్పుకొచ్చారు. అటు మహిళలపై అఘాయిత్యాలను అడ్డుకునేందుకు మహిళా పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారని అన్నారు. ఇక రోడ్డు ప్రమాదాల విషయానికొస్తే ఎక్కువగా టూ వీలర్ల ప్రమాదాలే ఉన్నాయన్నారు. అయితే సైబర్ నేరాలు భారీగా పెరిగాయని అయయన పేర్కొన్నారు. అయితే క్రైం రేటు తగ్గడానికి పోలీసులు తీసుకున్న ప్రత్యేక చర్యలే అని తెలుస్తోంది.

ప్రతీ ఏడాది క్రైం రేటు తగ్గించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటామని డీజీపీ చెప్పారు. ఈ ఏడాదిలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు చేసిన కేల్లో 44 మందికి శిక్ష వేశామని అన్నారు. 88.5 శాతం కేసుల్లో చార్జిషీట్లు వేశామని అన్నారు. ఈ కేసులు 2021 కంటే ఈ ఏడాదిలో తగ్గాయని అన్నారు. మహిళలకు తమకు ఎలాంటి ఆపద వచ్చినా వారిని దిశ యాప్ ద్వారా కాపాడుతున్నామని అన్నారు. నేటి యువతులు దిశ యాప్ ను అత్యధికంగా ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. దీంతో వారికి అండగా ఉంటున్నామన్నారు. దిశ యాప్ ను 85 లక్షల మంది ఉపయోగించుకున్నారని అన్నారు. ఈ యాప్ ద్వారా వచ్చిన 1500 ఫిర్యాదులపై కేసులు నమోదు చేశామన్నారు.

ఇక రోడ్డు ప్రమాదాలు ఈ ఏడాది తగ్గాయని తెలిపారు. నిత్యం జరిగే ప్రమాదాల ప్రదేశాలను గుర్తించి అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వాహనాల వేగం తగ్గించడానికి అంతర్గత రోడ్లు, ప్రధాన కూడళ్లు కలిసిన చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గతంతో పోలిస్తే రోడ్డు ప్రమాదాల సంఖ్య 19200 నుంచి 18739 వరకు తగ్గాయని అన్నారు. ఇక హెల్మెట్ల వాడకంపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇంకెన్ని చోట్ల రోడ్డు ప్రమాదాల స్పాట్లు ఉన్నాయో గుర్తిస్తామన్నారు.

ఈ ఏడాదిలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు తగ్గాయన్నారు. రాష్ట్రంలో 4 చోట్ల రీజనల్ సైబర్ సెంటర్స్ పెట్టి ట్రైనింగ్ ఇస్తామని అన్నారు. వారిపై దాడులు తగ్గించడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అయినా కొనసాగితే కఠిన చర్యలకు పూనుకున్నామన్నారు.

ఇక గంజాయి విషయంలోనూ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారన్నారు. కొంచెం సమాచారం దొరికితే ఆ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారన్నారు. గంజాయి సాగుచేసవారికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా ప్రోత్సాహాన్ని కలిగిస్తున్నామన్నారు. అయితే సైబర్ నేరాలు పెరిగాయిన డీజీపీ అన్నారు. ఈ ఏడాది 2,700 సైబర్ క్రైం కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇందుకు ప్రతి ఒక్కరికి డిజిటల్ మాద్యమం ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. వచ్చే ఏడాది పోలీసుల సహకారంతో మరిన్ని కేసలు తగ్గేందుకు కృషి చేస్తామన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.