Begin typing your search above and press return to search.
వాట్సాప్ పై సైబర్ దాడి జరిగిందా? కేంద్రం కీలక ఆదేశాలు?
By: Tupaki Desk | 25 Oct 2022 9:56 AM GMTప్రపంచంలోనే నంబర్ 1 సోషల్ మీడియా దిగ్గజం 'వాట్సాప్'. దీని అనుబంధ సంస్థలైన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ తో కలిసి 'మెటా' అనే సంస్థ కింద పనిచేస్తున్నాయి.వీటి మూడింటికి అధినేత మార్క్ జుకర్ బర్గ్. అయితే సడెన్ గా ఈరోజు 12.30 గంటలకు వాట్సాప్ నిలిచిపోయింది. దేశంలో జనాలు గగ్గోలు పెట్టారు. ఉద్యోగుల పని ఆగిపోయింది. ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి. ఉద్యోగుల మధ్య ప్రత్యుత్తరాలు ఆగిపోయాయి. ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు.చివరకు 2.30 గంటలకు వాట్సాప్ మళ్లీ యాక్టివ్ అయ్యింది. పనిచేయడం ప్రారంభిస్తోంది.
దేశంలో వాట్సాప్ 2 గంటల పాటు పనిచేయకపోవడం వెనుక సైబర్ దాడి జరిగిందన్న ప్రచారం సాగుతోంది. అందుకే అటు వాట్సాప్ సంస్థ కానీ.. దాని మాతృసంస్థ మెటా కానీ.. అధినేత మార్క్ జుకర్ బర్గ్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన లేదు.వాట్సాప్ పై సైబర్ దాడి చేసి హ్యాక్ చేసి డేటాను గల్లంతు చేశారన్న ప్రచారమూ సాగుతోంది. అందుకే దీనిపై వాట్సాప్ సంస్థ ఏ విషయాన్ని బయటపెట్టకుండా మౌనంగా ఉందని అంటున్నారు.
సాధారణంగా వాట్సాప్ సేవలు నిలిచినా నిమిషాల వ్యవధిలో పునరుద్ధరించేవారు. కానీ ఇవాళ దాదాపు గంటన్నర సేపు నిలిచిపోవడం.. వాట్సాప్ సంస్థ నుంచి ఎలాంటి వివరణ లేకపోవడంతో ఇది సైబర్ దాడి అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
వాట్సాప్ పై సైబర్ దాడి జరిగిందా? అన్న కోణంలో తాజాగా కేంద్రం ఆరాతీసింది. కేంద్ర ఐటీశాఖ స్వయంగా వాట్సాప్ ఓనర్ మెటా సంస్థను వివరణ కోరింది. ఇంతసేపు వాట్సాప్ సేవలు నిలిచిపోవడానికి కారణమేంటన్నది వివరించాలని మెటా ఇండియాను కోరింది.
దీంతో దీనిపై పూర్తి వివరాలు సమర్పిస్తామని మెటా ఇండియా సమాచారమిచ్చింది. ఈ ఘటన వెనుక సాంకేతిక కారణాలున్నాయా? లేక నిజంగానే సైబర్ దాడి జరిగి వినియోగదారుల డేటా గల్లంతైందా? అన్న కోణంలో వాట్సాప్ సంస్థ విచారణ చేస్తోంది. వివరణ ఇచ్చేందుకు మెటా ఇండియా రెడీ అవుతోంది.
వాట్సాప్ ఈ మధ్యాహ్నం నుంచి ఆగిపోయింది. టెక్నికల్ రీజన్సా లేక మరేదైనా కారణమో తెలియదు. సడెన్ గా ఆగిపోయింది. మెసేజ్ లు పంపలేకపోతున్నారు. కాల్స్ పోవడం లేదు. వాట్సాప్ స్టక్ అయిపోయింది. ఆగిపోవడం చూసి జనాలకు పిచ్చెక్కిపోయినట్టు అవుతోంది. ఆఫీసు పనులు, వ్యక్తిగత పనులు వ్యవహారాలన్నీ నిలిచిపోయాయి. చాలా మంది యూజర్లకు వాట్సాప్ డౌన్ అయిందని ఇప్పుడే అర్థమైంది.. డెస్క్‌టాప్ లేదా వెబ్‌లో కూడా ఓపెన్ కాలేదు. ఈ అంతరాయాలు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైంది. ఈ సమస్య కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులను ప్రభావితం చేసింది. తిరిగి 2.30 గంటలకు ఇది తిరిగి నడుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.