Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు ఆప్తులైన ఈ రెడ్డిలకు పదవులు పక్కా!
By: Tupaki Desk | 7 Jan 2019 6:07 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ నేపథ్యంలో శాసనసభ సమావేశాలు, ప్రొటెం స్పీకర్, స్పీకర్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు కావటంలో ఇప్పుడు అందరి దృష్టి మంత్రివర్గ కూర్పు పై పడింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు హోం మంత్రి మహమూద్ అలీ కూడా ప్రమాణం చేసిన నేపథ్యంలో.. తొలి దఫాలో మరో నలుగురు లేదా ఐదుగురితో ప్రమాణం చేయించనున్నట్టు తెలుస్తోంది. ఈనెల 18వ తేదీన్నే నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి అవకాశముందని టీ ఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో తొలి దఫా మంత్రివర్గానికి సంబంధించి పలువురి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన వీరికి అవకాశం కల్పించనున్నట్టు సమాచారం. అయితే, ఇందులో కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉడే ఇద్దరు రెడ్డి నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి.
ఆ ఇద్దరు నేతలే ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి. మిషన్ భగీరథ వైస్ చైర్మెన్,బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఇద్దరూ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు, పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి వీరికి తొలిదఫా లోనే ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయని తెలుస్తున్నది. అలా కానిపక్షంలో కనీసం వీరిద్దరిలో ఎవరికో ఒకరికి కేసీఆర్ మంత్రివర్గంలో బెర్తు ఖాయమని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి. పల్లా రాజేశ్వర రెడ్డి లేదా వేముల ప్రశాంతరెడ్డి తో పాటుగా మిగతా వారిలో కొప్పుల ఈశ్వర్ (కరీంనగర్), గంప గోవర్థన్ (నిజామాబాద్), తలసాని శ్రీనివాసయాదవ్ (హైదరాబాద్), నిరంజన్ రెడ్డి (మహబూబ్‌నగర్), గుత్తా సుఖేందర్ రెడ్డి (నల్లగొండ) పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. ప్రస్తుతానికి రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కే అవకాశం లేదని సమాచారం. ఆయా జిల్లాలకు రెండో దఫాలో ప్రాతినిధ్యం కల్పించాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం.