Begin typing your search above and press return to search.
వామ్మో.. యుద్ధంతో ఉక్రెయిన్ అన్ని రూ.లక్షలు కోట్లు నష్టపోయిందా?
By: Tupaki Desk | 23 Sep 2022 3:59 AM GMTఅమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల కూటమి అయిన నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ)లో చేరడం ద్వారా తన పొరుగుదేశం ఉక్రెయిన్ తన భద్రతకు ముప్పు కలిగిస్తుందని రష్యా భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా భారీ యుద్ధానికి దిగింది. ఇప్పటికే వేలమంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆస్తినష్టం వెలకట్టలేనంత స్థాయిలో ఉంది. ప్రపంచ దేశాల ఆంక్షలను, హెచ్చరికలను బేఖాతరు చేసిన రష్యా ఆ దేశంపై ఇంకా దాడి చేస్తూనే ఉంది. ఈ క్రమంలో పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది.
కాగా ఏడు నెలలుగా కొనసాగుతున్న రష్యా – ఉక్రెయిన్ యుద్ధంతో ఉక్రెయిన్ చావుదెబ్బతింది. ఆయా దేశాలు, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు ఇచ్చిన ఆయుధాలతో ఉక్రెయిన్.. రష్యాపై పోరాడుతోంది. అయితే రష్యా సైన్యం దాడుల్లో ఎన్నో వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, విమనాశ్రయాలు, నౌకాశ్రయాలు, పెద్ద పెద్ద నివాస సముదాయాలు ఇలా అన్నీ నేలమట్టమయ్యాయి. విదేశాలకు ఉక్రెయిన్ నుంచి గోధుమలు, వనస్పతి నూనెల ఎగుమతులు కూడా నిలిచిపోయాయి.
దీంతో ఉక్రెయిన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఉక్రెయిన్‌కు దాదాపు ఒక ట్రిలియన్ డాలర్ల(సుమారు రూ.80 లక్షల కోట్లు) మేర నష్టం వాటిల్లిందని సమాచారం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆర్థిక సలహాదారు ఓలెగ్ ఉస్తెంకో ఈ వివరాలు వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థను యుద్ధం తీవ్రంగా దెబ్బతీస్తోందని చెప్పారు.
ఇప్పటివరకు ఉక్రెయిన్ ప్రత్యక్షంగా, పరోక్షంగా.. దాదాపు ఒక ట్రిలియన్ డాలర్ల మేర నష్టపోయినట్లు వెల్లడించారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో 'జర్మన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్' నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఓలెగ్ ఉస్తెంకో ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా దాడికి ముందు ఉన్న ఉక్రెయిన్ వార్షిక జీడీపీతో పోల్చితే.. ప్రస్తుత నష్టం విలువ అయిదు రెట్లు ఎక్కువగా ఉందని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.
రష్యా పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడటం, ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలిపోవడం వంటి సమస్యలతో.. ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ చాలా కష్టంగా మారిందని ఉస్తెంకో అంటున్నారు. అనేక వ్యాపారాలు రష్యా దాడులతో తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయం సైతం.. మొదట్లో ఊహించిన దాంతో పోలిస్తే గణనీయంగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అక్కడికి తాము ప్రభుత్వ వ్యయంలో భారీ కోతలు విధించినప్పటికీ.. ఫిబ్రవరి నుంచి నెలకు ఐదు బిలియన్ యూరోల(4.9 బిలియన్ డాలర్లు) లోటును ఎదుర్కొంటోందని ఉస్తెంకో తెలిపారు. 2023లో ఇది దాదాపు 3.5 బిలియన్ యూరోలకు పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ సైతం 35 నుంచి 40 శాతం క్షీణిస్తుందని అంచనా వేశామన్నారు. 1991లో రష్యా నుంచి స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి తమ దేశానికి ఇదే అత్యంత గడ్డుకాలమని చెప్పారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.