Begin typing your search above and press return to search.
టీడీపీ ట్రాప్ లో వైఎస్సార్సీపీ?
By: Tupaki Desk | 25 Jan 2019 9:35 AM GMTఏపీలో ఉన్న పాతిక ఎంపీ సీట్లలో ఇప్పటి వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఎంపీ సీట్లలో సరైన అభ్యర్థులు లేరు. అభ్యర్థులు ఎవరనే అంశంపై ఇంకా తేల్చేసే పరిస్థితి కూడా లేదు. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర తర్వాత ఆ పార్టీకి వూపు వచ్చిన సంగతి నిజమే కానీ, ఈ వూపు ఎన్నికల్లో కొనసాగించాలంటే.. కార్యకర్తల, అభ్యర్థుల బలం చాలా అవసరం. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్ తీసుకువచ్చి.. పనిచేయకుండా ప్లాన్ ప్రత్యర్థులు అముల చేస్తున్నారనే మాట కూడా వినిపిస్తోందిప్పుడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీనే ఒక ట్రాప్ లో పడేస్తోందా? అనే టాక్ వినిపిస్తోంది.
ఎందుకంటే.. గత ఎన్నికల ముందు కూడా అన్ని సర్వేలూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని చెప్పాయి. జగన్ గవర్నమెంట్ ను ఫామ్ చేయడం ఖాయమన్నాయి. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గెలిచేస్తున్నట్టుగా ఫీలయ్యారు. తమకు తిరుగు లేదని అనుకున్నారు. చివరకు బోల్తా పడ్డారు. ఇక ఇప్పుడు కూడా అలాగే జరుగుతున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విషయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ జరుగుతూ ఉంది.
ఇప్పటి వరకూ వైకాపాలో సరైన క్యాండిడేట్స్ లేని ఎంపీ సీట్లు చాలానే ఉన్నాయి. అనంతపురం జిల్లాలో అనంతపురం సీటుకు, హిందూపురానికి సరైన అభ్యర్థులు లేరు. కర్నూలు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. రెండు సీట్లకూ అభ్యర్థులు ఎవరో తెలీదు. చిత్తూరు జిల్లాలో చిత్తూరు సీట్లో ఎవరు పోటీ చేస్తారో తెలీదు. గుంటూరు జిల్లాలో బాపట్ల, నర్సరావు పేట, గుంటూరు ఎంపీ అభ్యర్థుల ప్రకటన లేదు.
కృష్ణా జిల్లాలో విజయవాడ, మచిలీ పట్నం సీట్లకు అభ్యర్థులు ఎవరో తేలలేదు. ఇంకా ఏలూరు, నర్సిపట్నం, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ, అనకాపల్లి, వైజాగ్, అరకు, విజయనగరం, శ్రీకాకుళం సీట్లకూ ఇదే పరిస్థితి. వైకాపా మాజీ ఎంపీలున్న ఆరు సీట్లలో తప్ప మిగతా చోట్ట అభ్యర్థుల విషయంలో వైకాపా ప్రకటన చేయలేదు ఇంత వరకూ.
తెలుగుదేశం పార్టీ తరఫున సిట్టింగ్ ఎంపీలున్నారు, ఫిరాయింపు ఎంపీలున్నారు. వైకాపా ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఈ లోటు పాట్లను సరి చేసుకోకుండా.. సర్వేలు చేసి ఆనంద పడితే, చివరకు మిగిలేది ఈ ఆనందం మాత్రమే!