Begin typing your search above and press return to search.
షోయబ్ అక్తర్ నీకు అంతసీన్ లేదు.. వాస్తవంలో బతుకు..!
By: Tupaki Desk | 22 May 2021 1:15 AM GMTపాకిస్థాన్ మాజీ క్రికెటర్లు.. షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్ తరఫున దాదాపు 13 ఏళ్లుగా ఓ ఘటన విషయంలో గొడవ జరుగుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడో పదమూడేళ్ల క్రితం పాకిస్థాన్ జట్టు.. టీ20 ప్రపంచకప్ ఆడేందుకు దక్షిణాఫ్రికా వెళ్లింది. ఆ టైంలో డ్రెస్సింగ్ రూంలో షోయబ్ అక్తర్ కు మహమ్మద్ ఆసిఫ్ కు మధ్య గొడవ చెలరేగింది. ఆసిఫ్ మరో క్రికెటర్‌తో నవ్వుతూ మాట్లాడుతున్నాడు.. అదేటైంలో అక్కడికి వచ్చిన అక్తర్ ‘మీరు నా గురించే మాట్లాడుకుంటూ నవ్వుతున్నారు కదా’ అంటూ గొడవకు దిగాడు.
ఈ సందర్భంగా అక్తర్ కు ఆసిఫ్‌కు మధ్య గొడవ చెలరేగింది. అక్తర్ బ్యాట్ తీసుకొని ఆసిఫ్ పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనతో ప్రపంచంలోని క్రికెట్ అభిమానులు, క్రికెటర్లు నివ్వెరపోయారు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ ఘటనపై స్పందించి.. వెంటనే అక్తర్ ను అక్కడినుంచి వెనక్కి వచ్చేయాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే ఆ తర్వాత ఆసిఫ్ కు అక్తర్ సారీ కూడా చెప్పాడు.. కానీ ఇన్నేళ్లుగా ఈ వివాదం ఇంకా సాగుతూనే ఉంది.
తాజాగా ఈ వివాదంపై ఆసిఫ్ మాట్లాడుతూ..
‘ ఈ ఘటన ఎప్పుడో పదమూడేళ్ల క్రితం జరిగింది. అయినా అక్తర్ దీన్ని పట్టుకొని వేలాడుతున్నాడు. రీసెంట్ గా కూడా ఈ విషయంపై మాట్లాడుతూ.. నా మీద నోరు పారేసుకున్నాడు. దీంతో నేను అతడికి ఫోన్ చేశాను. అప్పుడెప్పుడో జరిగిన ఘటనను వదిలేయాలని కోరాను. నోరుమూసుకోమని కూడా చెప్పాను’ అంటూ ఆసిఫ్ పేర్కొన్నాడు.
ఆసిఫ్ ఇంకా ఏమన్నాడంటే.. ’ షోయబ్ అక్తర్ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటాడు. నిజానికి అతడికి అంత సీన్ లేదు. అక్తర్ ఓ సారి తాను పాకిస్థాన్ టీంకు హెడ్‌కోచ్ అవుతానని .. మరోసారి పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) చైర్మన్ అవుతానని ఊహించుకుంటాడు. నిజానికి అతడికి అంత సీన్ లేదు. అటువంటి పగటి కలలు కనకుండా.. కొత్తగా వస్తున్న క్రికెటర్లకు, బౌలర్లకు అతడు సలహాలు ఇవ్వడం బెటర్’ అంటూ ఆసిఫ్ సూచించాడు. ప్రస్తుతం ఆసిఫ్ వ్యాఖ్యలతో దుమారం రేగింది. ఈ ఘటనపై అక్తర్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.