Begin typing your search above and press return to search.

యాంకర్ డ్రెస్ మారిస్తేనే ఇంటర్వ్యూ అన్న క్రికెటర్

By:  Tupaki Desk   |   6 Feb 2016 7:28 AM GMT
యాంకర్ డ్రెస్ మారిస్తేనే ఇంటర్వ్యూ అన్న క్రికెటర్
X
కొన్ని విషయాల మీద చాలానే రచ్చ జరుగుతుంది. మా ఒళ్లు మా ఇష్టం. మేం కప్పుకుంటాం.. విప్పదీసుకుంటాం.. చూసే మీ కళ్లు బాగుంటే చాలు.. మేం ఎలా ఉన్నామన్నది మీకు అనవసరం లాంటి తరహా వాదనలు ఈ మధ్య కాలంలో తరచూ వినిపిస్తుంటాయి. తాజాగా దక్షిణాఫ్రికా క్రికెటర్ అమ్లా చేసిన వ్యాఖ్యలు కాస్త ఆలస్యంగా బయటకు వచ్చాయి. మత సంప్రదాయాల్ని పక్కాగా పాటిస్తాడన్న పేరున్న అమ్లా.. ఒక యాంకరమ్మ డ్రెస్ ను మార్పించిన ఘటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇటీవల భారత్ లో జరిగిన వన్డే సీరిస్ సందర్భంగా అమ్లాలోని కొత్త కోణం బయటకు వచ్చింది. క్రికెట్ ను మరింత ఆకర్షణీయంగా అందించేందుకు వీలుగా యాంకరమ్మలు ఆ మధ్య గ్రౌండ్ లోకి రావటం తెలిసిందే. ఆటతో సంబంధం లేకుండా వీలైనంత ఫ్యాషన్ గా కంటికి ఆకట్టుకునేలా ఉండే ఈ యాంకరమ్మలు వేసుకునే వస్త్రాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. ఇదిలా ఉంటే తాజాగా ఒక మహిళా వ్యాఖ్యాతకు చేదు అనుభవం ఎదురైంది.

భారత్ తో జరిగిన వన్డే సీరిస్ సందర్భంగా ముంబైలో జరిగిన ఆఖరి మ్యాచ్ తర్వాత ఒక మహిళా వ్యాఖ్యాత అమ్లాను ఇంటర్వ్యూకు పిలిచింది. అయితే.. ఆమె వేసుకున్న పొట్టి డ్రెస్సు విషయంలో అమ్లా అభ్యంతరం వ్యక్త చేశాడు. నెక్ టాప్ డ్రెస్ లో ఉన్న ఆమెకు తాను ఇంటర్వ్యూ ఇవ్వలేనని.. డ్రెస్ మార్చుకొని ఒళ్లంతా కప్పుకొని ఉంటే ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పటంతో షాక్ తిన్న ఆమె.. సర్దుకొని తన వాళ్లతో మాట్లాడింది. అమ్లా చెప్పిన రీతిలో నిండుగా వచ్చిన యాంకరమ్మకు అమ్లా ఇంటర్వ్యూ ఇచ్చాడట. మరి.. దీనిపై నేటి మహిళలు ఎలా రియాక్ట్ అవుతారో..?