Begin typing your search above and press return to search.
రిపోర్ట్ః అమెరికాలో మనోళ్లపై పెరుగుతున్న దాడులు
By: Tupaki Desk | 15 Nov 2017 4:59 AM GMTఅగ్రరాజ్యం అమెరికాలో పరిస్థితులు ఆందోళన కరంగా మారుతున్నాయి. అమెరికాలో ద్వేషపూరిత నేరాల పెరుగుదలపై తీరు అన్ని వర్గాల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఈ తరహా దాడుల్లో 2016లో 6121 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 2014తో పోలిస్తే 2015లో 10శాతం పెరుగగా, 2016లో మరో ఐదుశాతం దాడులు పెరిగాయని తెలుస్తోంది. ఈ ఆరువేల కేసుల్లో అత్యధికం జాత్యహంకార ఘటనలే కావడం అమెరికాలో నివసిస్తున్న వారిని ఆందోళన కలిగించేలా మారాయి.
జాత్యహంకార దాడులపై ప్రధానంగా నల్లజాతీయులపైన, ఆఫ్రికన్-అమెరికన్లపై జరిగిన దాడులే అత్యధికం. ముస్లింలపై 1500 వరకు దాడులు జరిగాయని సమాచారం. గతేడాది హిందువులకు వ్యతిరేకంగా 12, సిక్కులకు వ్యతిరేకంగా ఏడు ద్వేషపూరిత దాడులు జరిగినట్లు ఎఫ్‌బీఐ నివేదిక తెలిపింది. బౌద్ధులపై ఒకే ఒక్క దాడి ఘటన జరిగిందని తెలిపింది. మొత్తం దాడి ఘటనల్లో 3.1శాతం ఆసియావాసులపై, 1.3శాతం అరబ్‌దేశాల పౌరులపై జరిగాయని పేర్కొంది.
కాగా, ఇదిలాఉండగా...అమెరికాలో భారతీయవిద్యార్థుల సంఖ్య రెట్టింపైంది. 2016తో పోల్చుకుంటే ఈ ఏడాది 12.3 శాతం పెరిగింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వచ్చాక భారతీయ విద్యార్థులు అమెరికాకు వెళ్లి చదువుకోవాలంటేనే భయపడుతున్నారు. కానీ ఈ ఏడాది వారి సంఖ్య రెట్టింపవడం గమనార్హం. 2016-17 విద్యా సంవత్సరంలో అమెరికాలో 186,267 మంది భారతీయ విద్యార్థులు ఉన్నట్లు ఐఐఈ(ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్) నివేదిక వెల్లడించింది.