Begin typing your search above and press return to search.
పైసా ఖర్చు లేకుండా బోలెడు పబ్లిసిటీ.. హ్యాట్సాఫ్ టు TSRTC
By: Tupaki Desk | 15 May 2022 11:30 AM GMTఎంత గొప్ప ప్రొడెక్ట్ అయినా కూడా జనాల్లోకి వెళ్తేనే దాని యొక్క గొప్పతనం తెలుస్తుంది.. దాన్ని జనాలు కొనుగోలు చేస్తారు. జనాల వద్దకు వెళ్లాలంటే పబ్లిసిటీ చేయాల్సిందే. మారిన పరిస్థితులు.. వచ్చిన టెక్నాలజీని ఉపయోగించి జనాలు తమ బ్రాండ్స్ కు పబ్లిసిటీ చేస్తున్నారు. పెద్ద కంపెనీలు కోట్లకు కోట్లు ఖర్చు చేసి తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకుంటూ ఉంటే కొందరు మాత్రం తెలివిగా ఫ్రీ పబ్లిసిటీ దక్కేలా పనులు చేస్తూ ఉంటారు.
ఉదాహరణకు పెద్ద హీరోల సినిమాలు లేదా పెద్ద దర్శకుల వందల కోట్ల బడ్జెట్ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. కాని వర్మ మాత్రం పెద్దగా ఖర్చు చేయకుండానే తన సినిమాకు ఫ్రీగా పబ్లిసిటీ తెచ్చుకుంటాడు. ఇప్పుడు వర్మ పద్దతినే TSRTC వారు ఫాలో అవుతున్నారు. TSRTC కమీషనర్ గా సజ్జనార్ వచ్చిన తర్వాత అనూహ్యంగా మార్పులు చోటు చేసుకున్నాయి.
సోషల్ మీడియా ద్వారా వెళ్తే ఎంతో పబ్లిసిటీ దక్కుతుందని ఆయన గ్రహించాడు. అందుకే పబ్లిసిటీని కొత్తగా ట్రై చేశాడు. తమ సంస్థ బస్సుల ఆక్యుపెన్సీ పెంచడం కోసం సజ్జనార్ అనుసరించిన విధానాలు అద్బుతం. తెలంగాణ ఆర్టీసీ వారు కాకుండా మరే రాష్ట్ర ఆర్టీసీ వారు కూడా ఇలా ప్రమోషన్ చేసిన దాఖలాలు లేవు. కోట్లు పెట్టినా రాని పబ్లిసిటీ.. ప్రమోషన్ కాస్త డిఫరెంట్ గా ఆలోచించి సోషల్ మీడియా లో మీమ్స్ ద్వారా ప్రయత్నిస్తే దక్కుతుందని సజ్జనార్ గ్రహించడం నిజంగా అభినందనీయం.
ఒక ప్రైవేట్ ట్రావెల్ సంస్థ ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోకు కోట్ల పారితోషికం ఇచ్చి పబ్లిసిటీ చేయించుకుంది. కాని అదే స్టార్ హీరో సినిమా ఫోటోను ఉపయోగించి మీమ్స్ ను క్రియేట్ చేసి ఆర్టీసీ వారు అంతకు మించిన పబ్లిసిటీని దక్కించుకున్నారు. నిజంగా ఈ విషయంలో టీఎస్ఆర్టీసీ ట్విట్టర్ టీమ్ ను అభినందించకుండా ఉండలేం. వారి వెనుక ఉన్న సజ్జనార్ ను ఎంతగా అభినందించినా తక్కువే.
ఒక ప్రభుత్వ సంస్థకు ఇంత అగ్రసివ్ గా పబ్లిసిటీ చేయడం ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదు. ఏ ఒక్క కొత్త సినిమా వచ్చినా... ఏ ప్రత్యేకమైన సంఘటన వైరల్ సంఘటన జరిగినా కూడా దాన్ని ఉపయోగించుకుని ఆర్టీసీ కి పబ్లిసిటీ చేయడం పరిపాటిగా మారింది. ఇది టీఎస్ ఆర్టీసీకి చాలా ఉపయోగ పడుతుంది.
అందరి సంస్థ అయిన టీఎస్ ఆర్టీసీ కి ఇంతగా పబ్లిసిటీ చేస్తూ సంస్థ యొక్క బాగుకు కృషి చేస్తున్న ట్విట్టర్ టీమ్ మరియు కమీషనర్ కు ప్రత్యకంగా మా తరపున మరియు జనాల తరపున కృతజ్ఞతలు.