Begin typing your search above and press return to search.
గంభీర్ ను ముప్పు తిప్పలు పెడుతున్న ఆప్!
By: Tupaki Desk | 1 May 2019 2:30 PM GMTగట్టున కూర్చుని కామెంట్లు చేసేటప్పుడు హీరోలాగానే కనిపించాడు కానీ, ఇప్పుడు మాత్రం గౌతమ్ గంభీర్ కు అసలు విషయం అర్థం అవుతున్నట్టుగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్ కు దూరం అయ్యాకా గౌతమ్ గంభీర్ పలు పొలిటికల్ కామెంట్స్ చేస్తూ వచ్చాడు. వివిధ అంశాల గురించి స్పందిస్తూ పక్కా బీజేపీ మనిషిలా మాట్లాడుతూ వచ్చాడు ఈ క్రికెటర్.
అప్పుడే చాలా మంది అనుకున్నారు.. ఇతడు భారతీయ జనతా పార్టీలోకి చేరేలా ఉన్నాడని. చివరకు ఆ అంచనాలే నిజం అయ్యాయి ఈయన కమలం పార్టీలో చేరారు. చేరిన వెంటనే ఎన్నికల్లో కూడా పోటీకి రెడీ అయ్యారు. ఢిల్లీలోని ఒక ఎంపీ సీటు నుంచి కమలం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు గౌతమ్ గంభీర్.
అసలే ఢిల్లీ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు సత్తా చూపిస్తున్న దశలో ఉంది. ఇలాంటి నేపథ్యంలో గంభీర్ లాంటి వాళ్లు ఆప్ కు భలే దొరికారు. ఆవేశమే తప్ప గంభీర్ లో అంత ఆలోచన కనిపించదు. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ క్రికెటర్ ఆడుకుంటోంది ఆమ్ ఆద్మీ పార్టీ.
ఇప్పటికే గంభీర్ ను నైతికంగా ఇబ్బంది పెడుతోంది ఆప్. అతడు రెండు ఓటర్ కార్డులు కలిగిన వైనం గురించి ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఆ విషయంలో కేసును ఎదుర్కొంటున్నాడు గంభీర్. అంతే కాకుండా.. అనుమతి లేకుండా ర్యాలీని నిర్వహించడం విషయంలో కూడా ఈ బీజేపీ అభ్యర్థి ఒక కేసును ఎదుర్కొంటూ ఉన్నాడు. అవే అనుకుంటే.. ప్రచారంలో కూడా గంభీర్ పెద్దగా ఊపును చూపించలేకపోతున్నాడు.
మరోవైపు నియోజకవర్గం అభివృద్ధి, ఇతర విషయాల్లో గంభీర్ ను చర్చకు ఆహ్వానించింది ఆప్. తటస్థులు నిర్వహించే డిబేట్ కు రావాలని ఆమ్ ఆద్మీ అభ్యర్థి నుంచి గంభీర్ కు సవాల్ లాంటి ఆహ్వానం అందింది. దానికి కూడా గంభీర్ మొహం చాటేస్తున్నాడు. డిబేట్ కు హాజరయ్యే ఉద్దేశం తనకు లేనట్టుగా అతడు చెబుతూ ఉన్నాడు. ఇది ఈ క్రికెటర్ కు మరో మైనస్ పాయింట్ అవుతూ ఉంది.
ఢిల్లీ లాంటి నగర వాతావరణం ఉన్న చోట పోటీ చేస్తున్న అభ్యర్థి ..నయాతరం రాజకీయాలు చేయాలి. అలాంటి డిబేట్లలో సత్తా చూపించాలి. అంతే కానీ.. మొహం చాటేస్తే కుదరదు. అయితే గంభీర్ మాత్రం అలాంటివన్నీ తనకు పడవన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి వ్యక్తి క్రికెటర్ గా ఓకే కానీ, రాజకీయాల్లో ఏం నెట్టుకుస్తాడో చూడాలి!