Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా రావొచ్చు.. మాస్కు పెట్టుకోవాల్సిందే..!
By: Tupaki Desk | 11 Dec 2020 11:30 PM GMTత్వరలోనే కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తుందంటూ ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ప్రకటించాయి. ఇప్పటికే కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ కూడా ప్రారంభమైంది. అయితే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వెంటనే మాస్కులు విసిరేసి.. విచ్చలవిడిగా తిరగొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొంతకాలం పాటు మాస్కులు ధరించాల్సిందేనని సూచిస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా కరోనా సోకే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కొన్ని వ్యాక్సిన్లు రెండు డోసులు వేయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మొదటి డోసు వేయించుకున్నవెంబడే సురక్షితం అని నిర్ధారించుకోలేం. రెండో డోసు వేయించుకుంటేనే ఫలితం ఉంటుంది.
ఫైజర్ టీకాకు మొదటి డోసుకు రెండు డోసుకు రెండు వారాలు గడువు ఉంది. మొడెర్నా అయితే నాలుగు వారాల గడువు ఉంది. అంతేకాక టీకాల ప్రభావం తీసుకున్న వెంటనే కనిపించదని.. కొన్నివారాల సమయం పడుతుందని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నిపుణుడు డెబోరా ఫుల్లర్ పేర్కొన్నారు. టీకాల పనితీరు ఎలా ఉంటుంది అని విషయం ప్రజలందరికీ టీకాలు వేశాకే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. క్లినికల్ ట్రయల్స్ పూర్తయినప్పటికీ.. మాస్ వ్యాక్సినేషన్ వేస్తేనే టీకా ప్రభావం కచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ మాస్కులు ధరించాలని వాళ్లు సూచిస్తున్నారు.