Begin typing your search above and press return to search.

మీ టెన్షన్ అన్ని పోవాలంటే జపాన్ మాచా టీ తాగాల్సిందే ..!

By:  Tupaki Desk   |   7 Jan 2020 6:04 AM GMT
మీ టెన్షన్  అన్ని పోవాలంటే జపాన్ మాచా టీ తాగాల్సిందే ..!
X
టీ తాగడం అందరికి ఒక అలవాటు. ఇంట్లో కానీ , ఆఫీసుల్లో కానీ తమ టెంక్షన్స్ నుండి కొంచెం రిలాక్స్ కావడానికి చాలామంది ఈ టీ బాగా అలవాటు పడి పోయారు. కొంతమంది మంచం దిగాలి అన్నా కూడా టీ తాగాల్సిందే. ముఖ్యంగా పని ఒత్తిడి తట్టుకో లేక టీ తాగేవారే ఎక్కువగా ఉన్నారు. మీకు కూడా పని ఒత్తిడి బాగా ఉంటుందా? అయితే మీకు సరైన టీ... జపనీస్ మాచా టీ. ఈ టీ టెన్షన్, తలనొప్పి, ఆతృత, కంగారు, బడలిక, నీరసం, ఆందోళన వంటి లక్షణాల్ని పోగొట్టడంలో ఈ టీ తరువాతే ఏ టీ అయినాఅని తేలింది.

మాచా అనే మొక్కల ఆకుల నుంచీ, పొడిని తయారుచేస్తారు. ఆ పొడే... మాచా టీ పొడి. చూడ్డానికి గోరింటాకు పొడిలా కనిపిస్తుంది. ఈ టీ తాగితే మన శరీరంలో డోపమైన్ D1 రిసెప్టర్లు, సెరొటోనిన్ 5HT1A రిసెప్టర్లు యాక్టివేట్ అవుతాయట. ఇవి రెండూ టెన్షన్, ఆతృతలను తగ్గించేవి. ఇవి యాక్టివేట్ అయితే... మనకే మంచిది. నిజానికి పూర్వ కాలం నుంచీ మాచా ఆకుల పొడిని... మందుల తయారీ లో వాడే వాళ్లు. అప్పట్లో ఇది మనుషుల శరీరానికి మేలు చేస్తుంది అనుకునేవారు. దీనితో టెన్షన్ తగ్గించే ప్రయోజనం ఉందని జపాన్‌ లోని కుమామోటో యూనివర్శిటీ పరిశోధన లో తేలింది.

మాచా పొడిని మొదట, ఎలుకల పై ప్రయోగించి చూశారు. ఆ పొడితో చేసిన టీ తాగిన ఎలుకల్లో, టెన్షన్ బాగా తగ్గిపోయింది. దాంతో మనుషులపై కూడా ప్రయోగాలు చిన్నగా మొదలు పెట్టారు. అయితే , మనుషులపై కూడా ప్రయోగం చేసినప్పుడు అంతే సక్సెస్ అయ్యింది. వేడి నీటిలో మాచా టీపొడిని కలుపుకొని... ఫిల్టర్ చేసి తాగితే చాలు. లేదా, మాచా టీ పొడి బ్యాగ్స్ ఉపయోగించినా అంతే ప్రయోజనం ఉంటుంది. ఈ టీ పొడి ప్యాకెట్లు ఆన్‌లైన్ ఈ కామర్స్ సైట్లలో కూడా దొరుకుతాయి. ఇకపోతే , మామూలు టీ పొడులకూ, మాచా టీ పొడికీ ప్రధాన తేడా ఏమిటి అంటే .... జపాన్‌ లోని మాచా మొక్కలకు కొత్తగా వచ్చే ఆకుల నుంచీ ఈ పొడిని తీస్తారు. ఆ ఆకుల్లో కూడా 90 శాతం నీడలో మాత్రమే పెరిగిన ఆకులని తీసుకోని , అలా నీడలో పెరిగిన కొత్త ఆకుల్లోనే మన టెన్షన్ తగ్గించే అద్భుత లక్షణాలున్నాయని తేలింది. ఈ టీ పొడిలో చాలా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ..దీనితో టెన్షన్ నుండి రిలీఫ్ అవ్వడానికి ఇప్పుడు జపనీయులు ఈ టీ పొడినే ఎక్కువగా వాడుతున్నారు.