Begin typing your search above and press return to search.
సభ ముగిసింది.. మోడీ సందేశం విన్నారా?
By: Tupaki Desk | 23 Dec 2022 5:30 PM GMTపార్లమెంటు శీతాకాల సమావేశాలు.. శుక్రవారం(23వతేదీ)తో ముగిసిపోయాయి. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 29వ తేదీ వరకు ఈ సభలు నిర్వహించాల్సి ఉంది. అయితే.. క్రిస్మస్, జనవరి ఫస్ట్ వంటివి పండుగలు ఉన్న నేపథ్యంలో సభలకు సెలవిచ్చేసినట్టు స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌లు ప్రకటించి.. సభలకు తెరదించేశారు.
ఈనెల 7న ప్రారంభమైన సమావేశాలు.. షెడ్యూల్ ప్రకారం ఈనెల 29న ముగియాల్సి ఉంది. అయితే..పండగలు ఉన్నాయని.. నియోజకవర్గాల్లో సందడి చేయాలని సభ్యులు కోరడంతో వాటిని ముగించినట్టు సభలు పేర్కొన్నాయి. లోక్‌సభ.. 97శాతం పనిచేసినట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. సభ 13 రోజులపాటు 62 గంటల 42 నిమిషాలపాటు పనిచేసినట్లు చెప్పారు.
సరే..ఈ 13 రోజుల్లో ప్రధాని చెప్పిన సందేశం ఏదైనా ఉందా? అంటే.. కేంద్రం చెప్పింది ఉంది. ఎందుకంటే.. ప్రధాని పెద్దగా మాట్లాడింది లేదు. ఆయన జీ20 సదస్సులతోనే సరిపెట్టారు. సో.. ఇంతకీ కేంద్రం చెప్పింది ఏంటంటే.. తన పని గురించి కాదు.తాను ప్రజలకు ఏం చేసిందీ చెప్పలేదు. రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయని.. రాష్ట్రాలు ఉచితాలు పంచుతున్నాయని.. రాష్ట్రాల్లో అవినీతి పెరిగిందని.. ఎస్సీలపైనా.. ఎస్టీలపైనా కేసులు పెరిగాయని చెప్పింది.
అంటే.. మొత్తంగా రాష్ట్ర తప్పులు ఎత్తి చూపేందుకు.. శీతాకాల సమావేశాలను మోడీ సద్వినియోగం చేసుకున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం.. మోడీ పాలనపై రాష్ట్రాల్లోని నాయకులు.. ధ్వజమెత్తుతున్నారు. ఈ క్రమంలోనేరుగా తాను విమర్శలు చేయడం ఎందుకని..
పార్లమెంటును వేదికగా చేసుకుని.. ఆయన ఇలా రాష్ట్రాలపై ఎదురు దాడి చేయించి..సమాప్తం పలికారనే టాక్‌వినిపిస్తోంది. మొత్తంగా.. ఈ శీతాకాల సమావేశాలు.. దేశ ప్రజల పన్నులతో నడుస్తున్న బ్యాంకులు పెద్దలకు సమర్పించిన 20 లక్షల కోట్ల సొమ్ము విషయాన్ని మాత్రం నిర్మొహమాటంగా చెప్పేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.