Begin typing your search above and press return to search.

టాటా 'న్యూ' సూపర్ యాప్ గురించి విన్నారా?

By:  Tupaki Desk   |   8 April 2022 9:30 AM GMT
టాటా న్యూ సూపర్ యాప్ గురించి విన్నారా?
X
దేశంలో చాలానే కంపెనీలు ఉండొచ్చు. కానీ.. మరే కంపెనీకి లేని ఒక ప్రత్యేకత.. దేశ ప్రజలంతా సగర్వంగా చెప్పుకునే కార్పొరేట్ కంపెనీల్లో టాటా ముందుంటుంది. ఈ కంపెనీ చేసే వ్యాపారం ఏదైనా సరే విలువలతో ఉంటుందన్న మాట ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. అందుకే.. టాటా బ్రాండ్ ఏదైనా సరే.. దానికుండే ఇమేజ్ లెక్క వేరుగా ఉంటుంది.తాము చేసే ప్రతి వ్యాపారాన్ని విలువలతో చేపట్టే టాటా సంస్థ.. తాజాగా దేశీయ డిజిటల్ మార్కెట్ లోకి సరికొత్తగా ఎంట్రీ ఇచ్చింది.

కూరగాయలు నుంచి విమాన టికెట్టు వరకు ఏదైనా సరే.. ఉన్న చోటు నుంచి కదలకుండా చేతిలో ఇమడిపోయే సెల్ ఫోన్ సాయంతో బుక్ చేసుకోవటానికి వీలుగా టాటా న్యూ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

తమ గ్రూపులోని అన్ని వ్యాపారాల్ని ఇందులోకితీసుకొచ్చేశారు. అంతేకాదు.. డిజిటల్ చెల్లింపుల్ని సైతం షురూ చేశారు. అమెజాన్.. ఫ్లిప్ కార్ట్.. రిలయన్స్ జియో మార్ట్ అ తరహాలో ఈ యాప్ తో దేశీయ.. ఇకామర్స్ లో కీలక పాత్ర పోషించనుంది.

సంస్థ సంప్రదాయాల్ని ఏ మాత్రం మిస్ కాకుండా.. వినియోగదారుడికి పెద్ద పీట వేసేలా టాటా గ్రూపు.. తమ టాటా న్యూ యాప్ ను ఆవిష్కరించింది. టాటా కుటుంబంలో అత్యంత పిన్న వయసున్న టాటా న్యూ యాప్ వినియోగదారుల జీవితాల్ని మరింత సులువుగా చేస్తుందని.. సౌకర్యవంతంగా ఉంటుందని చెబుతున్నారు. చక్కటి కొనుగోలు అనుభూతిని మిగల్చటంతో పాటు.. వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా మార్పులు చేసుకుంటామని పేర్కొన్నారు.

ప్రస్తుతం టాటా న్యూ యాప్ లో టాటా సంస్థలకు చెందిన ఎయిర్ ఏషియా.. బిగ్ బాస్కెట్.. క్రోమా.. ఐహెచ్ సీఎల్.. క్యూమిన్.. స్టార్ బక్స్.. 1ఎంజీ.. టాటా క్లిక్.. టాటా ప్లే.. వెస్ట్ సైడ్ లాంటి బ్రాండ్లు ఉన్నాయి. తర్వలోనే విస్తారా.. ఎయిరిండియా.. తనిష్క్.. టాటా మోటార్స్ లాంటివి కూడా చేరనున్నాయి. ఒక్క క్లిక్ తో టాటా గ్రూపుకు సంబంధించిన ఏ ఉత్పత్తిని అయినా కొనుగోలు చేసే అవకాశాన్ని ఈ యాప్ ద్వారా లభిస్తుందని చెబుతున్నారు.

టాటా న్యూ యాప్ ప్రాజెక్టు మొత్తం చంద్రశేఖరన్ ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగింది. ఏడాదిగా దీని మీద పని చేస్తూ తాజాగా విడుదల చేశారు. దీని విజయం మీద పెద్ద ఎత్తున అంచనాలుఉన్నాయి..మరేం జరుగుతుందోచూడాలి.