Begin typing your search above and press return to search.

ఇమ్రాన్ ఖాన్ ను చంపేందుకు హత్యాయత్నం చేసినోడి వాదన విన్నారా?

By:  Tupaki Desk   |   4 Nov 2022 11:03 AM IST
ఇమ్రాన్ ఖాన్ ను చంపేందుకు హత్యాయత్నం చేసినోడి వాదన విన్నారా?
X
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులకు పాల్పడిన ఒక ఆగంతుడికి ఉదంతం షాకింగ్ గానూ.. పెను సంచలనంగా మారింది. పిస్టల్ తో కాల్పులు జరిపిన వేళ.. తూటాలు ఆయన కాలి భాగం నుంచి దూసుకెళ్లటం..గాయాల బారిన పడటం తెలిసిందే.

ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇమ్రాన్. ఈ ఉదంతం ప్రంపంచ వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఇమ్రాన్ పై హత్యాయత్నంచేసిన వ్యక్తిని అప్పటికప్పుడు అదుపులోకి తీసుకున్ానరు.

వజీరాబాద్ లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడేందుకు తాను ప్రయాణిస్తున్న కంటైనర్ పైకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ పై గన్ తో కాల్పులుజరపటం.. ఈ ఘటనలో ఆయనతో పాటు.. ఆయన సహచరులుపలువురు గాయాల బారిన పడటం తెలిసిందే.

కాల్పులకుకారణమైన నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న వేళ.. ఆ నిందితుడు మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాను ఇమ్రాన్ ను ఎందుకు అంతమొందించాలనుకున్నది స్పష్టంగా పేర్కొన్నాడు. తన లక్ష్యం కేవలం ఇమ్రాన్ మాత్రమేనని.. మిగిలిన వారెవరూ కాదన్నారు.

ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నందుకే ఇమ్రాన్ ను అంతమొందించాలని తాను అనుకున్నట్లుగా పేర్కొన్నారు. ఇమ్రాన్ చేపట్టిన లాంగ్ మార్చ్ .. ప్రజల్ని తప్పుదారి పట్టిస్తుందని.. ''దాన్ని చూస్తూ భరించలేకపోతున్నా. అందుకే అతడ్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నా.

అందుకే ఇమ్రాన్ లాహోర్ దాటినప్పటి నుంచి ఆయన్ను చంపేందుకు ప్లాన్ చేస్తున్నా. ఇమ్రాన్ మీద కాల్పులు జరిపింది నేను ఒక్కడినే.. నాతో ఇంకెవరు లేరు'' అని స్పష్టం చేయటం గమనార్హం. ఇమ్రాన్ పై జరిగిన కాల్పుల ఉదంతంపై పెద్ద ఎత్తున ఖండనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.