Begin typing your search above and press return to search.
ఏపీ పురపోరులో ‘సామాజిక కోణాన్ని’ గమనించారా?
By: Tupaki Desk | 19 March 2021 7:30 AM GMTపోటాపోటీగా జరిగినట్లుగా కనిపించిన ఏపీ పురపోరు ఫలితాల్ని చూసినప్పుడు వార్ వన్ సైడ్ అన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. మొత్తం 11 మేయర్ స్థానాలకు.. 74 మున్సిపాలిటీలకుజరిగిన ఎన్నికల్లో అత్యధికం వైసీపీ సొంతం చేసుకుంది. అత్యధిక స్థానాల్ని సొంతం చేసుకున్న అధికార పార్టీ అందుకు తగ్గట్లే.. మేయర్లు.. మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికలో కొత్తదనాన్ని ప్రదర్శించటం ఆసక్తికరంగా మారింది. మేయర్ లాంటి పదవులను రాజకీయాలకు సంబంధం లేని సాదాసీదావారికి అప్పజెప్పటం ద్వారా ఏపీలో సరికొత్త రాజకీయ ముఖచిత్రానికి తెర తీశారని చెప్పాలి.
అదే సమయంలో.. పురపోరులో విజయం సాధించిన వారి సామాజిక కోణాన్ని చూస్తే.. కొత్త చిత్రం ఆవిష్కృతమైందన్న భావన కలుగక మానదు. సామాజిక వర్గాల ఆధారంగా చూస్తే.. అగ్ర వర్ణాల వారికి అధికారం తగ్గగా.. బీసీ.. మైనార్టీల చేతికి అధికారం బదిలీ అయిన వైనం కనిపిస్తుంది. పదకొండు కార్పొరేషన్ల మేయర్లను చూస్తే.. వారిలో ఎనిమిది మంది బీసీ.. మైనార్టీలకు చెందిన వారు ఉండటం విశేషం.
ఇక.. ఇద్దరు ఎస్సీలకు నగర ప్రథమ పౌరుడిగా నిలిస్తే.. ఒకే ఒక్క చోట మాత్రం ఓసీకి అవకాశం లభించింది. అది కూడా అనంతపురంలో మాత్రమే. అది కూడా టీడీపీ సొంతం చేసుకున్న చోట మాత్రమే. ఇక.. నగర పాలక.. నగర పంచాయితీల విషయానికి వస్తే.. ఏపీలోని మొత్తం 74 చోట్ల ఎన్నికలు జరిగాయి. వీరిలో 43 మంది బీసీ.. మైనార్టీలకు పదవులు లభిస్తే.. పదకొండు మందికి ఎస్సీలకు ఛైర్మన్లుగా ఎంపికయ్యారు.
మొత్తం 74 మందిలో కేవలం 27 శాతం పదవులు మాత్రమే ఓసీల సొంతమయ్యాయి. ఎస్టీల్లో ఇద్దరికి ఛైర్మన్లు అయ్యే అవకాశం లభించింది. మొత్తంగా చూస్తే.. బీసీ.. మైనార్టీలకే మేయర్.. ఛైర్మన్ పదవులు దక్కాయని చెప్పక తప్పదు. పుర పోరు అనంతరం వచ్చిన పదవుల్లో అగ్రవర్ణాల అధిక్యం ఏ మాత్రం కనిపించని పరిస్థితి. ఒక విధంగా ఏపీలో సరికొత్త సామాజిక రాజకీయ మొదలైనట్లేనని చెప్పాలి.