Begin typing your search above and press return to search.
విడిపోయినా సుఖంగా ఉంచుతున్న ఫేస్ బుక్
By: Tupaki Desk | 21 Nov 2015 10:42 AM GMTసోషల్ మీడియా సైట్ ఫేస్ బుక్ నిత్యం కొత్త ఆప్షన్ లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. మనుషుల మధ్య సంబంధాలు ఎల్లకాలం ఒకేలా ఉండవన్న సత్యం తెలిసిన ఫేస్ బుక్ ఇప్పుడు అలా విడిపోయేవారి కోసం కొత్త ఆప్షన్లను తీసుకొచ్చింది. బ్రేకప్ అయిన తరువాత అంతకు ముందు ఇద్దరి మధ్య సంభాషణలు కానీ, ఫొటోలు కానీ, ఇతర పోస్టింగులకు సంబంధించినది ఏదైనా ఫేస్ బుక్ నుంచి తొలగించడానికి అవకాశమేర్పరిచింది. ఆ ఇద్దరికి సంబంధించిన అంశాలను పూర్తిగా డిలీట్ చేయాలా... కొన్నికొన్ని సెలక్టడ్ గా డిలీట్ చేయాలా.. లేకుంటే అన్నీ కొనసాగించాలా అన్న ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది.
అదే సమయంలో ఫేస్ బుక్ కు సంబంధించి ఇంకో అంశం కూడా ఆసక్తి కలిగిస్తోంది. తాజా సర్వేప్రకారం ఫేస్ బుక్ లో 300 మందికి మించి స్నేహితులుంటే ఒత్తిడి పెరుగుతుందని తేలింది. 12-17 సంవత్సరాల వయసున్న 88మంది కౌమారదశలో ఉన్న ఫేస్ బుక్ వినియోగదారులపై జరిపినఈ పరిశోధనలో ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ సంఖ్య 300పైగాఉంటే వారు ఒత్తిడికి లోనవుతారని, ఒత్తిడికికారణమైన హార్మోన్ కార్టిసోల్ వారిలో అధికంగావిడుదలవుతుందని తేలింది. అదే సమయంలో ఫ్రెండ్స్ పోస్టింగులకు లైక్ లు కొట్టడం - రిప్లై మెసేజ్‌లు ఇవ్వడం ద్వారా కార్టిసోల్ హార్మోన్ విడుదల శాతాన్నికొంత మేరకు తగ్గించవచ్చని పరిశోధనకారులుచెబుతున్నారు.