Begin typing your search above and press return to search.

ట్రంప్ తాజా ఆర్డ‌ర్‌ కు మ‌ళ్లీ షాక్‌

By:  Tupaki Desk   |   9 March 2017 9:28 AM GMT
ట్రంప్ తాజా ఆర్డ‌ర్‌ కు మ‌ళ్లీ షాక్‌
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ విడుద‌ల చేసే ఉత్త‌ర్వుల‌కు వ్య‌తిరేకంగా పోరాడే జాబితా పెరిగిపోతోంది. ఆరు ముస్లిం దేశాల వలసదారులపై ఆంక్ష‌లు విధిస్తూ తాజాగా ట్రంప్ జారీ చేసిన ఫ‌ర్మానాకు మ‌ళ్లీ ప్ర‌తిష్టంభ‌న ఎదురైంది. ట్రంప్ తాజా ఆదేశాల‌ను న్యాయ‌ప‌రంగా స‌వాలు చేసేందుకు హ‌వాయి రాష్ట్రం సిద్ధ‌మైంది. ట్రంప్ ఆదేశాల‌ను ధిక్క‌రిస్తూ దావా వేసేందుకు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఫెడ‌ర‌ల్ జ‌డ్జి డెరిక్ వాట్స‌న్ అనుమ‌తి ఇచ్చారు. దీంతో తాజా ఆదేశాల‌పై అనుమాన‌పు మేఘాలు క‌మ్ముకున్నాయి.

ఏడు ముస్లిం దేశాల‌పై నిషేధం విధిస్తూ ఈ జ‌న‌వ‌రిలో ట్రంప్‌ జారీ చేసిన మొద‌ట ఆదేశాల‌కు వ్య‌తిరేకంగా కూడా హ‌వాయి రాష్ట్రం దావా దాఖ‌లు చేసింది. అయితే ఇప్పుడు తాజాగా ట్రంప్ జారీ చేసిన ఆదేశాలు అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయ‌ని ఆ రాష్ట్రం అభిప్రాయ‌ప‌డింది. ట్రంప్ ఆదేశాల‌ను వెంట‌నే నిలిపివేయాల‌ని కోర్టును కోరేందుకు హ‌వాయి రాష్ట్రం సిద్ధ‌మైంది. మార్చి 15వ తేదీన ఈ అంశంపై కోర్టులో వాద‌న‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీనికి అన్ని ర‌కాలుగా సిద్ధ‌మైన‌ట్లు హ‌వాయి రాష్ట్ర ప్ర‌తినిధులు మీడియాతో తెలిపారు.

మ‌రోవైపు ఇమ్మిగ్రేష‌న్ చ‌ట్టాల‌ను అమ‌లు చేసేందుకు అమెరికా ప్రెసిడెంట్‌ కు అధికారాలున్నాయ‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. దేశ సంక్షేమం కోసం క‌ల్పించిన ఈ అధికారాల వ‌ల్లే వ‌ల‌స‌ల‌పై అధ్య‌క్షుడు ట్రంప్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వివ‌రించింది. అయితే తాజా ఆదేశాల వ‌ల్ల త‌మ రాష్ట్ర ఆదాయం ప‌డిపోతుంద‌ని హ‌వాయి ఆరోపించింది. కొత్త ఆదేశాల వ‌ల్ల విద్యార్థుల‌ను - ఉపాధ్యాయుల‌ను రిక్రూట్ చేసేందుకు వ‌ర్సిటీలు ఇబ్బందిప‌డాల్సి ఉంటుంద‌ని హ‌వాయి రాష్ట్ర ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/