Begin typing your search above and press return to search.
హైకోర్టు మాట; పన్ను కట్టాల్సిందే..!
By: Tupaki Desk | 10 April 2015 9:04 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్రవివాదానికి కారణమైన ఎంట్రీటాక్స్ విషయంలో తాజాగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా త్రైమాసిక పన్ను చెల్లించాల్సిందేనని ట్రాన్స్‌పోర్ట్ యజమానులకు ఆదేశాలు జారీ చేసింది.
అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి మరికొన్ని మాటలు చెప్పింది. ట్రాన్స్‌పోర్ట్ వర్గాలు కట్టిన పన్నులోని ఒక్క పైసాను కూడా ఖర్చు చేయకూదని ప్రభుత్వానికి చెప్పింది. పన్ను కింద జమ అయిన మొత్తాన్ని బ్యాంకు అకౌంట్లో ఉంచాలని పేర్కొంది.
తెలంగాణ ప్రభుత్వం వసూలు చేసే ఎంట్రీటాక్స్ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాలని.. ఈ కేసు విషయంలో తుది తీర్పు వచ్చే వరకూ అందులోని మొత్తాన్ని ఎలాంటి ఖర్చుకు వినియోగించకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సో.. ప్రస్తుతానికైతే పన్నుపోటు తప్పనట్లే. మరి.. తుది తీర్పు ఎప్పుడు వస్తుందో..?