Begin typing your search above and press return to search.
కొమ్మినేని శ్రీనివాసరావు కి బిగ్ షాక్..మరో 43 మందికి నోటీసులు!
By: Tupaki Desk | 29 May 2020 10:50 AM GMTన్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అసభ్య పోస్టులు పెట్టిన మరో 44 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే 49 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యల అంశంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలతో సీఐడీ అధికారులు అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో మరో న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మరో 44 మందికి ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
సామాజిక మాధ్యమాల్లో హైకోర్టును కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ అధికార వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు ప్రసాద్ రెడ్డి, ఎన్నారై పంచ్ ప్రభాకర్ సహా ..మొత్తం 44 మందికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది. న్యాయస్థానంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. కోర్టులను కించపరిచే వ్యాఖ్యలు చేసిన పలువురిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే , ఈ వ్యవహారం పై కొమ్మినేని శ్రీనివాస్ స్పందించారు. " నాకు ఇంకా నోటీసులు రాలేదు అని, అలాగే నాకు తెలిసి నేను ఏ న్యాయమూర్తిని అగౌరవపర్చలేదు అని,పైగా ఎవరైనా అభ్యంతరకరంగా మాట్లాడితే ఖండించాను. అలా చేయరాదని చాలా స్పష్టంగా చెప్పాను అని , అయితే న్యాయమూర్తుల తీర్పులకు ఉద్దేశాలు ఆపాదించకుండా, విశ్లేషించడం తప్పు కాదని అంటారు అని చెప్పుకొచ్చారు. అలాగే ఆ నోటీసులో ఏమి ఉందో చూసిన తర్వాత దీనిపై పూర్తిగా స్పందిస్తాను అని తెలిపారు.