Begin typing your search above and press return to search.

హైకోర్టు ఆర్డ‌ర్ : క‌మ‌ల్‌ పై కేసు పెట్టండి

By:  Tupaki Desk   |   24 Nov 2017 12:19 PM GMT
హైకోర్టు ఆర్డ‌ర్ : క‌మ‌ల్‌ పై కేసు పెట్టండి
X
విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గ‌లింది. హిందువుల్లోనూ ఉగ్రవాదులున్నారంటూ కమల్ ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. దీనిపై ప‌లు వ‌ర్గాలు తిప్పికొట్టాయి. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హీరో కమల్‌ హాసన్‌ పై కేసు నమోదు చేయాలని చెన్నై సిటీ పోలీసులను ఇవాళ మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ ఆ అంశంపై పోలీసులు ఏదైనా చర్య తీసుకుని ఉంటే, దాని పట్ల ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఇవాళ మద్రాస్ కోర్టు పోలీసులను ఆదేశించింది.

క‌మ‌ల్ కామెంట్ల నేప‌థ్యంలో ఆయ‌న‌ మతసామర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఓ అడ్వకేట్ వేసిన పిల్ ఆధారంగా జస్టిస్ ఎంఎస్ రమేశ్ ఈ ఆదేశాలు జారీ చేశారు. హిందువులను ఉగ్రవాదులుగా పోల్చుతూ కమల్ అసందర్భ వ్యాఖ్యలు చేశారని పిటీషనర్ తన పిల్‌లో ఆరోపించారు. ఇవాళ హిందువులను ఉగ్రవాదులు అన్న వ్యక్ - రేపు క్రిస్టియన్లు - ముస్లింలను కూడా ఉగ్రవాదులని అంటారని ఆ పిటిషనర్ పేర్కొన్నారు. ఏ మతం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదన్న విషయాన్ని కమల్ తెలుసుకోవాలన్నాడు.

కాగా, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ క‌మ‌ల్ హాస‌న్ కామెంట్ల‌ను ఖండించిన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీలో ఓ మీడియా సంస్థ‌తో హోంమంత్రి ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ ఉగ్ర‌వాదాన్ని త‌మ ప్ర‌భుత్వం ఏ రూపంలో ఉన్నా అణిచివేస్తోంద‌ని తెలిపారు. రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించిన క‌మ‌ల్ హ‌స‌న్ త‌న పొలిటిక‌ల్ మైలేజీ కోసం ఇలాంటి కామెంట్లు చేయ‌డం స‌రికాద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఈ కామెంట్లు ర‌చ్చగా మారిన నేప‌థ్యంలో...క‌మ‌ల్‌హాస‌న్ సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చారు. తాను కూడా హిందువేని అని, హిందువుల సెంటిమెంట్‌ను గాయపరిచే ఉద్దేశం తనకు లేదని స్పష్టంచేశాడు. తనపై నాస్తికుడు అన్న ముద్రను పడటం కూడా ఇష్టం లేదని చెప్పాడు. తాను అతివాద అన్న పదాన్నే వాడానని, ఉగ్రవాదం అని వాడలేదని వివరణ ఇచ్చాడు. అయితే హింస ఏ రూపంలో ఉన్న తాను సహించబోనని మాత్రం తేల్చి చెప్పాడు.త‌ద్వారా తనపై వస్తున్న హిందూ వ్యతిరేక ముద్రను తొలగించుకునే ప్రయత్నం చేశాడు కమల్.