Begin typing your search above and press return to search.
రోహిత్ ఎపిసోడ్ లో మరో వీసీకి సెలవు షాక్
By: Tupaki Desk | 30 Jan 2016 4:25 AM GMTహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య గడిచిన 11 రోజులుగా దేశ వ్యాప్తంగా ఎంత కలకలం సృష్టిస్తుందో తెలిసిందే. ఈ వ్యవహారంలో వర్సిటీ వీసీగా ఉన్న అప్పారావు సెలవుపై వెళ్లటం.. అనంతరం ఆయన స్థానంలో శ్రీవాస్తవను నియమించటం తెలిసిందే. ముంబయి బాంబు పేలుళ్ల ఉదంతంలో యాకూబ్ మెమన్ ఉరికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించటం.. దీనికి పోటీగా ఏబీవీపీ సంఘం నిరసన వ్యక్తం చేయటం.. ఈ పరిణామాల నేపథ్యంలో ఏబీవీపీ నేతలు.. మెమన్ ఉరికి వ్యతిరేకంగా రోహిత్ అండ్ కో చేపట్టిన ఆందోళనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ తన లేఖల ద్వారా రోహిత్ వ్యవహారాన్ని హెచ్ఆర్డీ శాఖకు తెలియజేశారు.
ఈ నేపథ్యంలో రోహిత్ తో సహా ఆరుగురు విద్యార్థులపై సస్పెన్షన్ వేటు పడింది. దీన్ని వ్యతిరేకిస్తూ.. గత కొద్దిరోజులుగా విద్యార్థులు కొందరు వర్సటీలో ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. రోహిత్ వర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నారు. అతని ఆత్మహత్యపై తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టటం.. దీనికి మద్దతు పలుకుతూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి ఆందోళన చేపట్టటంతో ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో వార్తాంశంగా మారింది.
అనంతరం.. పలువురు జాతీయ నాయకులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి రోహిత్ ఆత్మహత్యపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులకు తమ మద్దతును ప్రకటించారు. రోహిత్ ఆత్మహత్యకు కారణంగా కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ.. స్మృతి ఇరానీలతో పాటు.. వీసీలపై వేటు వేయాలంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. రోహిత్ అండ్ కో మీద చర్యలు తీసుకోవాలంటూ బండారు దత్తాత్రేయ కోరటం.. దీనికి సానుకూలంగా మరో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వ్యవహరించటంపై కొందరు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఇదే సమయంలో రోహిత్ దళితుడని.. అందువల్ల అతడి పట్ల వివక్ష ప్రదర్శించిన కారణంగానే అతడు ఆత్మహత్య చేసుకున్నాడన్న వాదన మొదలైంది.అయితే.. రోహిత్ అసలు దళితుడు కాదని.. అతను వడ్డెర కులస్తుడని రోహిత్ తండ్రి వ్యాఖ్యలు చేయటంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. విద్యార్థులు చేస్తున్న ఆందోళనల వేడి తగ్గించే క్రమంలో వర్సిటీ వీసీ అప్పారావును సెలవులో పంపి.. శ్రీవాస్తవ్ ను వర్సిటీ తాత్కాలిక వీసీగా నియమించారు. అయితే.. ఆయన నియమకాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించటం.. తాజాగా రోహిత్ జయంతి సందర్భంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వర్సిటీ విద్యార్థులతో కలిసి నిరసన చేయటానికి సిద్ధం కావటంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.
ఈ సమయంలోనే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వర్సటీ తాత్కాలిక వీసీగా నియమించిన శ్రీవాస్తవ్ ను సెలవులో పంపి ఆయన స్థానంలో పెరియార్ ను తాత్కాలిక వీసీగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. యూనివర్సటీలో సీనియర్ మోస్ట్ అయిన పెరియార్ ఎంపిక ద్వారా నిరసనలకు చెక్ పెట్టే ప్రయత్నం జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోహిత్ ఎపిసోడ్ లో ఇప్పటికే ఇద్దరు వీసీలకు షాక్ తగిలి.. మూడో వీసీగా పెరియార్ బాధ్యతలు చేపట్టారు. తాజాగా నియమితులైన పెరియార్ అయినా రోహిత్ ఆత్మహత్యపై వెల్లువెత్తుతున్న ఆందోళనలకు ముగింపు పలికేలా చేస్తారా? లేదా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.