Begin typing your search above and press return to search.
గుడ్ న్యూస్ : కరోనా టీకా కనిపెట్టిన హెచ్ సీయూ
By: Tupaki Desk | 28 March 2020 3:57 PM GMTప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఒకే ఒక్క విషయం గురించి చర్చ జరుగుతోంది. అదే కరోనా వైరస్. కోవిడ్ 19 కు ప్రపంచమే వణికి పోతుంది. దాదాపు అన్ని దేశాలు కూడా ఈ వైరస్ కు టీకాను కనుక్కునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వేల కోట్లను ఖర్చు చేస్తున్నా కూడా అంత స్పీడ్ గా కరోనాకు టీకా కనుక్కోలేమంటూ చాలా మంది శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ సమయంలోనే కరోనాకు టీకా కనిపెడుతున్నారు.. కనిపెట్టారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ శీమా మిశ్రా కరోనా టీకాను కనిపెట్టారట. కరోనా వైరస్ శరీరంలోకి వెళ్లిన తర్వాత దాని నిర్మాణంను ఆపేయడంతో పాటు నిర్మాణేతర ప్రోటీన్లను ఈ టీకా విచ్చిన్నం చేస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ టీకాను ప్రయోగాత్మక పరిశీలనకు పంపించినట్లుగా చెబుతున్నారు.
ఈ టీకా పలు విధాలుగా పని చేస్తుందని అంటున్నారు. ఒక వైపు కరోనా వైరస్ తో శరీరంలో పోరాడుతూనే మరో వైపు రోగి వ్యాదినిరోదక శక్తిని పెంపొందిస్తుందని అంటున్నారు. శరీరంలో ఉన్న కరోనా వైరస్ కణాలను నాశనం చేసేలా ఈ టీకా పని చేస్తుందని అంటున్నారు. ఇదే కనుక నిజం అయితే ఈ టీకా ప్రయోగాత్మకంగా కరోనాపై పోరాడుతుందని రుజువు అయితే ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకోవచ్చు. రోజు రోజుకు వేలల్లో పెరుగుతున్న కరోనా కేసులు లక్షల్లో పెరగక ముందే ఈ టీనాను అందుబాటులోకి తీసుకు రావాలని జనాలు కోరుకుంటున్నారు.