Begin typing your search above and press return to search.

ఆ మాజీ ప్రధానికి మొబైల్ వాడకమూ రాదట

By:  Tupaki Desk   |   14 Dec 2016 11:34 AM GMT
ఆ మాజీ ప్రధానికి మొబైల్ వాడకమూ రాదట
X
ప్రధాని మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత నల్లధనం నియంత్రణపై మొదట్లో గట్టిగా మాట్లాడారు.. రద్దయిన నోట్లన్నీ తిరిగి ఖాతాల్లో పడతాయని అనుకోలేదు. కానీ... చెలామణీలో ఉన్న పెద్ద నగదులో ఇంతవరకు సుమారు 90 శాతం మళ్లీ బ్యాంకుల్లోకి వచ్చేసింది. దీంతో నల్లధనం ఇంతేనా అన్న ప్రశ్న మొదలవుతోంది, ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అండ్ కో క్యాష్ లెస్ ట్రాన్జాక్షన్లను ఫోకస్ చేస్తున్నారు. విపక్షాలు కూడా దీనిపైనే ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అనుకున్నది జరగకపోవడంతో మోడీ ఇప్పుడు బలవంతంగా ప్రజలను ఇబ్బందులు పెడుతూ క్యాష్ లెస్ వైపు మళ్లిస్తున్నారని అంటున్నారు. మోడీని రఫ్ఫాడడంలో టాప్ లో ఉన్న మమతా బెనర్జీ - కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇప్పుడు మరో పెద్ద నేత తోడయ్యారు. భారత దేశానికి ప్రధానిగా పనిచేసిన దేవెగౌడ కూడా మోడీ చర్యలను తప్పుపట్టారు. దేశానికి ప్రధానిగా పనిచేసిన తనకు ఇప్పటికీ మొబైల్ ఫోన్ వాడడం రాదని.. తనలాంటివాడికే కష్టంగా ఉన్న విషయంలో చదువులేనివారికి, గ్రామీణులకు ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు.

డిజిటల్ లిటరసీ లేని భారత్ లో నగదు రహిత లావాదేవీలంటే నగరవాసులకే నప్పుతాయి కానీ గ్రామీణ భారత దేశంలో అదంతా సాధ్యం కాదని దేవెగౌడ తేల్చేశారు. మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని కూడా ఆయన అన్నారు.

కాగా దేవగౌడ వ్యాఖ్యలో మోడీ డీమానిటైజేషన్ డెసిషన్ ను తప్పుపట్టిన రెండో ప్రధాని అయ్యారు. మాజీ ప్రధాని మన్మోహన్ ఇప్పటికే మోడీ నిర్ణయాలను తప్పు పట్టిన సంగతి తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశంలోనే అతి పెద్ద నేరమని కూడా మన్మోహన్ అన్నారు. ఇప్పుడు దేవగౌడ కూడా మన్మోహన్ కు జత కలిశారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/