Begin typing your search above and press return to search.
మోడీపై మాజీ ప్రధాని పొగడ్తల వర్షం
By: Tupaki Desk | 15 Oct 2019 4:25 AM GMTరాజకీయ శత్రువు చేత సైతం పొగిడించే తెలివి ప్రధాని నరేంద్ర మోడీ సొంతంగా చెప్పాలి. ఆయనకు వ్యూహాలు సెట్ చేసే టీంకు అభినందనలు తెలియజేయాల్సింది. ఒక అరగంట పాటు చేసిన పనితో భారీ ఇమేజ్ ను సొంతం చేసుకునే నైపుణ్యం నమో సొంతంగా చెప్పాలి. తమ ప్రభుత్వం కూలిపోవటానికి కారణమైన మోడీని.. తాజాగా చేసిన పనితో ఆయనకు ఫిదా అయిపోయారు మాజీ ప్రధాని దేవగౌడ.
ఇటీవల మహాబలిపురం దగ్గరి మామల్లాపురం బీచ్ లో ఉదయాన్నే కాళ్లకు చెప్పుల్లేకుండా చెత్తను ఏరేసిన ప్రధాని మోడీపై మాజీ ప్రధాని దేవగౌడ్ హర్షం వ్యక్తం చేస్తూ ఏకంగా ట్వీట్ చేశారు. చెప్పల్లేకుండా మామల్లాపురం బీచ్ లో ప్రధాని మోడీ చెత్త ఏరివేసిన వీడియోను చూశాను. ప్లాస్టిక్ రహిత భారత్ వైపు అడుగులు వేయటానికి ఒక ఉత్తేజితకరమైన ప్రారంభంగా ఆయన అభివర్ణించారు.
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో సమావేశం అయ్యేందుకు మామల్లాపురం బీచ్ దగ్గరి ఫైవ్ స్టార్ హోటల్లో బస చేసిన మోడీ.. ఉదయాన్నే దగ్గర్లోకి బీచ్ కు వెళ్లి.. చెత్త ఏరివేయటం.. అందుకు సంబంధించిన చిట్టి వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసుకోవటం.. అనూహ్యంగా చైనా అధ్యక్షుడి సమావేశంపైన కంటే కూడా.. బీచ్ లో చెత్త ఎత్తేసిన మోడీ గురించే ఎక్కువ చర్చ జరగటం తెలిసిందే.
ఇటీవల కర్ణాటకలోని కాంగ్రెస్ తో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీఎస్ సర్కార్ కూలిపోయి.. ఆ ప్రభుత్వం స్థానే బీజేపీ సర్కారు పాలనా పగ్గాలు చేజిక్కించుకోవటం తెలిసిందే. తమ చేతుల్లో నుంచి అధికార పగ్గాలు లాగేసుకున్నప్పటికీ.. ప్రధాని మోడీ చేసిన పనిని మెచ్చుకున్న దేవగౌడ వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ కు దూరమై.. బీజేపీకి దగ్గరయ్యే యోచనలోనే దేవగౌడ తాజా వ్యాఖ్యలు ఉన్నాయా? అన్నది ఇప్పుడు చర్చగా మారింది. గతంలో గుజరాత్ లో సర్దార్ పటేల్ భారీ విగ్రహమైన యూనిటీ ఆఫ్ స్ట్యాచ్యూపైనా దేవగౌడ పెద్ద ఎత్తున పొగిడేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో రానున్న రోజుల్లో చోటుచేేసుకునే పరిణామాలతో బీజేపీకి జేడీఎస్ ఎంత దగ్గరకానుందన్న దానిపై క్లారిటీ వచ్చే వీలుంది. ఏమైనా.. ప్రత్యర్థుల పొగడ్తల్ని సొంతం చేసుకున్న ప్రధానిగా మోడీ నిలుస్తారనటంలో సందేహం లేదు.