Begin typing your search above and press return to search.

బాబు దుబారా మ‌రోసారి హెడ్ లైన్స్!

By:  Tupaki Desk   |   9 Aug 2018 12:17 PM GMT
బాబు దుబారా మ‌రోసారి హెడ్ లైన్స్!
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దుబారా గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఓప‌క్క రాష్ట్రం పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోతున్నా.. త‌న ఆడంబ‌రాల్ని మాత్రం ఆయ‌న త‌గ్గించుకోక‌పోవ‌టం ఇప్ప‌టికే ప‌లుమార్లు విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. అయిన‌ప్ప‌టికీ.. బాబు త‌న తీరును మార్చుకోని ప‌రిస్థితి.

విభ‌జ‌న కార‌ణంగా ఏపీ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి పూర్తిగా చితికి పోయిన విష‌యాన్ని అదే ప‌నిగా ప్ర‌స్తావిస్తూ.. త‌మ‌ను ఆదుకోవాల‌ని అదే ప‌నిగా అడ‌గ‌టం క‌నిపిస్తుంది. మ‌రింతలా సాయం అడిగే పెద్ద‌మ‌నిషి.. త‌న వ‌ర‌కూ తాను ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలి. కానీ.. అదేమీ ప‌ట్టించుకోని బాబు.. విలాసాల‌కు.. ఆడంబ‌ర ఖ‌ర్చుల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

తాజాగా.. బాబు చేసిన డాబుస‌రి ఖ‌ర్చు లెక్క బెంగ‌ళూరులో స్థానిక మీడియాలో హెడ్ లైన్స్ గా మారింది జ‌నాలు ఛీ కొట్టే ప‌రిస్థితి. బాబు నాలుగున్న‌రేళ్ల పాల‌న‌లో ప్ర‌జాధ‌నాన్ని దారుణంగా దుర్వినియోగం చేసిన తీరుపై ఇప్ప‌టికే ప‌లుమార్లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయినా.. అదేమీ ప‌ట్ట‌ని బాబు త‌న తీరును అస్స‌లు మార్చుకోలేదు.

ఇటీవ‌ల క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా కుమార‌స్వామి ప్ర‌మాణ‌స్వీకార మ‌హోత్స‌వానికి బాబు హాజ‌రు కావ‌టం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న బ‌స చేసిన హోట‌ల్ బిల్లు అక్ష‌రాల రూ.8.7 ల‌క్ష‌లు అయిన విష‌యాన్ని తాజాగా బెంగ‌ళూరు మిర్ర‌ర్ బ్యాన‌ర్ స్టోరీగా వచ్చింది. ఒక ఆర్టీఐ కార్య‌క‌ర్త అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా కుమార‌స్వామి ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి ప్ర‌భుత్వం పెట్టిన ఖ‌ర్చుతో పాటు.. వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల బ‌స కోసం పెట్టిన ఖ‌ర్చు బిల్లుల స‌మాచారాన్ని వెల్ల‌డించారు.

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మే 23 ఉద‌యం 9.49 గంట‌ల‌కు హోట‌ల్లో దిగి మే 24 ఉద‌యం 5.34 గంట‌ల‌కు హోట‌ల్ ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇందుకు ఆయ‌న‌పై హోట‌ల్ వేసిన బిల్లు రూ.8,72,485గా పేర్కొన్నారు. అదే స‌మ‌యంలో ఢిల్లీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ హోట‌ల్ బిల్లు మాత్రం రూ.1.85 ల‌క్ష‌లుగా ఉండ‌టం గ‌మ‌నార్హం. అంద‌రి కంటే త‌క్కువ‌గా కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ హోట‌ల్ బిల్లుగా చెప్పాలి. ఆయ‌న హోట‌ల్ బ‌స చేసిన దానికి వేసిన బిల్లు రూ.1.02ల‌క్ష‌లు కావ‌టం గ‌మ‌నార్హం.

గ‌తంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రులుగా వ్య‌వ‌హ‌రించిన య‌డ్యూర‌ప్ప‌.. సిద్ధ‌రామ‌య్య‌ల ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం సంద‌ర్భంగా హాజ‌రైన అతిధుల కోసం ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేయ‌లేద‌ని.. కానీ.. కుమార‌స్వామి ప్ర‌భుత్వం మాత్రం ఏకంగా రూ.42 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసిన వైనాన్ని ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించారు. విధాన స‌భ హాల్ లో మే 23న ఇచ్చిన తేనీటి విందున‌కు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం చేసిన ఖ‌ర్చు రూ.4.35ల‌క్ష‌లుగా తేల్చారు. టీ.. స్నాక్స్ ను తాజ్ వెస్ట్ ఎండ్ హోట‌ల్ నుంచి తెప్పించిన‌ట్లుగా చెబుతున్నారు.

ఈ ఖ‌ర్చు వ్య‌వ‌హారం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఇక‌.. బ‌స కోసం వివిధ ప్ర‌ముఖుల‌కు పెట్టిన ఖ‌ర్చు వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వాటిని చూస్తే..

+ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్: రూ. 1,02,400

+ ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్: రూ. 1,02,400

+ బహుజన్ సమాజ్‌ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి: రూ. 1,41,443

+ కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లట్: రూ. 1,02,400

+ సీపీఎం నేత సీతారం ఏచూరి: రూ. 64వేలు

+ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్: రూ. 38,400

+ ఎన్సీపీ నేత శరద్ పవార్: రూ.64వేలు

+ మ‌జ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ: రూ. 38,400

+ జార్ఖండ్ మాజీ సీఎం బాబూలాల్: రూ. 45,952

+ సినీ నటుడు కమల్ హాసన్: రూ.1,02,040

+ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఖ‌ర్చులు మాత్రం బ‌య‌ట‌కు రాలేదు