Begin typing your search above and press return to search.
మీతో కలిసి పనిచేస్తాం.. కేసీఆర్‌కు కుమారస్వామి హామీ?
By: Tupaki Desk | 11 Sep 2022 11:30 PM GMTజాతీయ రాజకీయ ప్రస్థానం మొదలు పెడుతున్నా. నిజామాబాద్ సభ సాక్షిగా నిర్ణయం తీసుకుంటున్నా. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో మన ప్రభుత్వం ఏర్పాటైతే దేశవ్యాప్తంగా రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్తును ఇస్తాం. తెలంగాణ పథకాలన్నింటినీ అమలు చేస్తాం అని ప్రకటించిన కేసీఆర్ ఆ దిశగా కసరత్తును ముమ్మరం చేశారు. కొత్త జాతీయ పార్టీని ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. అతి త్వరలోనే జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు అధికార పార్టీ పత్రిక, చానల్ ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
నిజానికి, జాతీయ పార్టీ పెడతానని కొంతకాలంగా కేసీఆర్ చెబుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు భారీ కసరత్తు కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల జాతీయ స్థాయిలో రైతు సంఘాల నాయకులతో ప్రగతి భవన్లో రెండు రోజులపాటు సమావేశం నిర్వహించారు. ఇక, ఈ క్రమంలోనే తాజాగా సీఎం కేసీఆర్ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామితో నూ భేటీ అయ్యారు. స్వయంగా ప్రగతి భవన్‌కు కుమార స్వామిని ఆహ్వానించిన కేసీఆర్.. విందు కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు జాతీయ రాజకీయాలపై చర్చించారు.
ఎన్డీఏ, యూపీఏ తరహా పీపుల్ ఫ్రంట్ అవశ్యకతపై.. కేసీఆర్ అభిప్రాయం వెల్లడించారు. తమతో కలిసి రావాలని కుమారస్వామి ని కేసీఆర్ కోరారు. జాతీయ రాజకీయాల్లో కలిసి పనిచేసేందుకు.. కుమారస్వామి కూడా సుముఖత వ్యక్తం చేశారని తెలిసింది. సుమారు రెండు గంటల పాటు కేసీఆర్‌తో జాతీయ రాజకీయాల గురించి కుమార స్వామి చర్చించారని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని తలపోస్తున్న కేసీఆర్‌తో కర్ణాటక అగ్రనేత భేటీ కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అంతకుముందు హైదరాబాద్ వచ్చిన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిని టీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. కుమారస్వామి బస చేసిన హోటల్కు వెళ్లిన కేటీఆర్.. ఆయనతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్తో అర్థవంతమైన చర్చలు జరిగినట్లు కుమారస్వామి ట్వీట్ చేశారు. అభివృద్ధిపై గొప్ప విజన్ ఉన్న నేత కేటీఆర్ అని ఆయన కొనియాడారు. తెలంగాణ, కర్ణాటకతో పాటు కీలకమైన జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు కుమారస్వామి వెల్లడించారు.