Begin typing your search above and press return to search.
ఆ షేరుతో వారి సుడి ఒక్కరోజులో మారింది
By: Tupaki Desk | 7 Aug 2018 5:30 PM GMTరోజులో ఎంత సంపాదించొచ్చు? అంటే.. మీరు చెప్పే ఏ సమాధానం.. మేం చెప్పే దాంతో సరిపోదు. అందుకే ఈ ముచ్చట వార్తగా మారింది. హెచ్ డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీ తాజాగా మెరుపులు మెరిపించటంతో ఒక్కసారిగా ఆ షేర్లు ఉన్న వారి సుడి ఒక్కసారిగా మారింది.
రోజు వ్యవధిలో ఆ షేర్ ధర 68 శాతం పెరిగిపోవటంతో.. ఆ షేర్లు ఉన్న వారి ఆస్తులు భారీగా పెరిగిపోయాయి. సోమవారం మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు ఒక్కో షేరు రూ.1100తో ఉంది. ముందు రోజుతో పోలిస్తే 58 శాతం లాభంతో బీఎస్ ఈలో రూ.1738 వద్ద లిస్ట్ అయ్యింది.
ఇంట్రాడేలో 68 శాతం లాభంతో రూ.1863 వద్ద గరిష్ఠస్థాయిని టచ్ చేసింది. చివరకు 65 శాతం లాభంతో రూ.1815 వద్ద ముగిసింది. ఈ షేరు కారణంగా ఒక్కసారిగా పలువురి అదృష్టాలు మారిపోయాయి. ఈ కంపెనీ షేరు ఉన్న వారంతా భారీగా లాభం పొందారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ కంపెనీ షేర్లు భారీగా ఉన్న కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి మిలిండ్ బార్వే వాటా విలువ ఏకంగా రూ.188 కోట్లకు చేరుకుంది.
మరో కీలక అధికారి చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ అధికారి ప్రశాంత్ జైన్ షేర్ విలువ రూ.161 కోట్లకు పెరిగింది. వీరివే కాకుండా మరికొందరు కీలక ఉద్యోగుల సంపద కోట్లల్లో పెరిగిపోయింది. ఇప్పుడు చెప్పండి.. రోజు వ్యవధిలో ఇంత భారీ ఎత్తున ఆస్తులు ఏ వ్యాపారం చేస్తే మాత్రం వస్తుంది చెప్పండి?