Begin typing your search above and press return to search.
ఫారిన్ నుంచి వచ్చిన పెళ్లి చేసుకున్న తెలంగాణ కుర్రాడు.. తర్వాతేమైందంటే?
By: Tupaki Desk | 21 March 2020 6:30 AM GMTకొన్ని ఉదంతాలు విన్నంతనే విపరీతమైన ఆవేశంతో పాటు.. ఆగ్రహంతో ఒళ్లు మండిపోవటం ఖాయం. ఉన్నత విద్యను అభ్యసించి.. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేటోళ్లు.. ఇలాంటి పనులు కూడా చేస్తారా? అన్న సందేహం తాజా ఉదంతాన్ని విన్నంతనే కలగటం ఖాయం. తెలంగాణకు చెందిన ఒక పోరడి వ్యవహారం ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్త మయ్యేలా చేస్తోంది.
ఉత్తర తెలంగాణకు చెందిన ఒక యువకుడు ఇటీవల ఫారిన్ నుంచి వచ్చాడు. అతగాడు ఉండే దేశంలో కరోనా ప్రభావం తీవ్రస్థాయిలో ఉంది. అలాంటి దేశం నుంచి వచ్చిన ఆ కుర్రాడు.. వచ్చి రాగానే పెళ్లికి రెఢీ అయిపోయాడు. అతడికి సన్నిహితంగా ఉండే కొందరు పెళ్లి విషయంలో కాస్త ఆలోచించుకోవాలని.. కాస్త ఆగి చేసుకుంటే మంచిదన్న సూచనలు చేశారు. అయినా తగ్గలేదు. తనకేం ఫర్లేదని భరోసా ఇచ్చేసి పెళ్లి చేసుకున్నాడు.
అతగాడి పెళ్లికి దగ్గర దగ్గర వెయ్యి మంది వరకూ హాజరయ్యారు. వేడుక ఘనంగా సాగింది. కట్ చేస్తే.. ఇప్పుడా కుర్రాడు జలుబుతో.. జ్వరంతో ఇబ్బంది పడుతున్నాడు. సందేహం వచ్చి గాంధీలో చేరాడు. అతగాడికి ప్రాథమిక చికిత్స చేసి వైద్యులు.. ప్రాథమికంగా కరోనా నిర్దారణ చేసినట్లుగా తెలుస్తోంది. కాకుంటే.. ఫూణె నుంచి రావాల్సిన నివేదిక కోసం వెయిట్ చేస్తున్నారు. అక్కడ నుంచి వచ్చే నివేదిక దాదాపుగా పాజిటివ్ అయి ఉంటుందన్న మాట లోగుట్టుగా వినిపిస్తోంది. ఇలాంటి ఉదంతాలు.. కరోనా వ్యాప్తికి కారణాలుగా చెబుతున్నారు.
ఆ కుర్రాడి అత్యుత్సాహం.. పిలిచిన వెంటనే ఇప్పుడున్న పరిస్థితులపై అవగాహన లేకుండా పెళ్లికి వచ్చిన వందలాది మంది తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది. గడిచిన కొద్దిరోజులుగా కరోనాపై పెద్ద ఎత్తున అవగామన కల్పిస్తోంది ప్రభుత్వం. ఏ సందర్భాల్లో కరోనా వైరస్ సోకుతుందనే వివరాల్ని ప్రచారం చేస్తున్న వేళ కూడా.. మొండితనం.. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో చేసుకునే వేడుకలు కొత్త ముప్పును తెచ్చి పెడుతుంటాయనటానికి ఈ ఉదంతం ఒక చక్కటి ఉదాహరణగా అభివర్ణిస్తున్నారు. ఇప్పుడా పోరడికి కరోజా పాజిటివ్ అని తేలితే.. పెళ్లికి వచ్చిన వెయ్యి మందిలో ఎంతమందికి కరోనా ఛాన్స్ ఉంటుందన్న ప్రశ్నే.. ఒళ్లు జలదరించేలా చేయక మానదు. ఈ ఉదంతం గురించి విన్నంతనే సదరు పెళ్లికొడుకు మీద ఒళ్లు మండక మానదు. తాను ఇబ్బందుల్లో పడటమే కాదు.. తన చుట్టూ ఉన్న వారిని పడేసిన తీరు మిగిలిన వారికి గుణపాఠం గా మారాల్సిన అవసరం ఉందంటున్నారు.