Begin typing your search above and press return to search.

ఐపీఎల్ చరిత్రలో ఆ రికార్డు ఎక్కువసార్లు సాధించినోడు అతడేనట

By:  Tupaki Desk   |   4 May 2022 3:26 AM GMT
ఐపీఎల్ చరిత్రలో ఆ రికార్డు ఎక్కువసార్లు సాధించినోడు అతడేనట
X
ఐపీఎల్ చరిత్రలో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్న క్రీడాకారుడిగా దక్షిణాఫ్రికాకు చెందిన బౌలర్ కగిసో రబాడ నిలిచారు. పంజాబ్ కింగ్స్ బౌలర్ గా వ్యవహరిస్తున్న ఈ 26 ఏళ్ల బౌలర్.. తాజాగా జరిగిన గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో మరోసారి తన సత్తా చాటారు. ఈ మ్యాచ్ లో మరోసారి అరుదైన ఫీట్ ను సొంతం చేసుకున్నాడు.

తాజా మ్యాచ్ లో మొత్తం నాలుగు ఓవర్లు వేసి 33 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నారు. ఈ రీతిలో మ్యాచ్ ల్లో ఎక్కువసార్లు నాలుగు వికెట్లు సాధించి బౌలర్ గా మూడో స్థానానికి చేరుకున్నాడు.

ఐపీఎల్ చరిత్రలో నాలుగు వికెట్లను ఎక్కువసార్లు సాధించిన ఆటగాళ్లలో కగిసో రబాడ మూడో వాడిగా నిలిచారు. కుడి చేతి వాటంతో బంతిని సంధించే ఫాస్ట్ బౌలర్ గా అతడికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచుల్లో 2014లో అరంగ్రేటం చేసిన అతను.. ఆ తర్వాతి ఏడాది నుంచే టెస్టు క్రికెట్ ఆడుతున్నాడు.

గుజరాత్ టైటాన్స్ తో జరిగిన తాజా మ్యాచ్ లో మరో హ్యాట్రిక్ ఫీట్ ను త్రుటిలో మిస్ అయ్యారు. తన మూడో ఓవర్లో హ్యాట్రిక్ ఫీట్ ను జస్ట్ మిస్ అయ్యారు. ఒకటి పోతే మరొకటి దొరికిన చందంగా.. ఐపీఎల్ మ్యాచుల్లో నాలుగు వికెట్లు ఎక్కువసార్లు సాధించిన మూడో బౌలర్ గా నిలవటం విశేషంగా చెప్పాలి. ఇప్పటివరకు మొత్తం 59 మ్యాచుల్లో ఎనిమిది సార్లు నాలుగు వికెట్లు సాధించిన ఫీట్ ను సొంతం చేసుకున్నాడు కగిసో రబాడ.

ఈ రికార్డు విషయానికి వస్తే జాబితాలో అగ్ర స్థానంలో ఉన్నారు సునీల్‌ నరైన్‌ . మొత్తం 144 మ్యాచుల్లో ఎనిమిది సార్లు ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. తర్వాతి స్థానంలో మలింగ ఏడుసార్లు సాధించారు. మూడో స్థానంలో రబాడ నిలిచారు. మిగిలిన ఇద్దరితో పోలిస్తే.. రబాడా రికార్డే విశేషమైందని చెప్పాలి.

మిగిలిన వారిలా కాకుండా అతి తక్కువ మ్యాచ్ లలో ఈ ఫీట్ ను సాధించారని చెప్పాలి. టెస్టుల్లో ఇతగాడి సగటు వికెట్లు 22.4 అయితే.. వన్డే క్రికెట్ లో 27.7గా ఉంది. టీ20లో 25.4 కాగా.. ఐపీఎల్ లో 19.7గా ఉంది. వన్డేల్లో మాదిరి తన సత్తాను చాటితే రబాడా రికార్డులో అదిరేలా నమోదవుతాయని చెప్పక తప్పదు.