Begin typing your search above and press return to search.
ఆయన వయసు 68 ఏళ్లు.. కానీ, ఎంత ఇన్సిపిరేషన్ అంటే..!
By: Tupaki Desk | 27 Oct 2022 4:10 AM GMTఆయనకు 68 ఏళ్లు. అంటే.. వయోవృద్ధుడు అన్నమాట. కానీ, ఆయన వృద్ధాప్యం.. శరీరానికే కానీ, మనసు కాదని నిరూపించారు. చదవాలనే కృషి, పట్టుదల ఉంటే వయస్సు ఏమాత్రం అడ్డం కాదని మరోసారి రుజువు చేశారు ఈ 68 ఏళ్ల వ్యక్తి. తన కేసును తానే వాదించుకోవడం కోసం రిటైరైన తరవాత కూడా.. పట్టుదలతో న్యాయశాస్త్రం పూర్తి చేసి అందర్నీ ఔరా అనిపించారు.
న్యాయశాస్త్రం చదివి అందరికీ ఆదర్శంగా నిలిచారు. తన సొంత వ్యాపార కేసులను వాదించుకోవడానికి లా కోర్సు చేశారు. ఆయన పంజాబ్లోని ఓ విశ్రాంత ప్రభుత్వోద్యోగి.
పంజాబ్లోని బఠిండాకు చెందిన ప్రశోత్తం బన్సల్ ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ఎన్ఎఫ్ఎల్లో పనిచేస్తూ 2016 లో పదవీవిరమణ పొందారు. అనంతరం 2019లో పంజాబ్లోని బఠిండా విశ్వవిద్యాలయం నుంచి రెగ్యులర్గా 'లా' కోర్సు పూర్తిచేశారు.
బన్సల్కు సొంతంగా కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. వాటిపై న్యాయపరమైన సమస్యలు ఉన్న కారణంగా కోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. మొదట్లో న్యాయపరంగా సరైన అవగాహన లేక కేసుల విచారణ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురుకోవాల్సి వచ్చిందని చెప్పారు బన్సల్. అందుకే తాను న్యాయవిద్య చదివినట్లు తెలిపారు.
'ప్రతీ ఒక్కరూ భారతీయ చట్టాల గురించి తెలుసుకోవాలి. అప్పుడే వారి హక్కులను, అధికారాలను తెలుసుకోగలుగుతారు. న్యాయం పొందడం, హక్కులను తెలుసుకోవడం ప్రతీ ఒక్కరి హక్కు' అని ఆయన అన్నారు. తాను లా కోర్సులో చేరినప్పుడు విద్యార్థులు సహకరించలేదని, క్రమంగా తనతో వారు కలసిపోయారని చెప్పారు బన్సల్.
గతంలో అమ్మాయిలు న్యాయవాద రంగంవైపు వచ్చేవారు కాదని.. ఇప్పుడు పెద్ద సంఖ్యలో అమ్మాయిలు న్యాయవృత్తిని చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. అందుకు తాను సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. సో.. దీనిని బట్టి తెలిసేదేంటంటే.. వయసు అయిపోయిందని అనుకోకుండా.. ఆసక్తిని చంపుకోకుండా. ప్రయత్నం చేస్తే.. ఏదైనా ఫలిస్తుందనే విషయమే!!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.