Begin typing your search above and press return to search.
ఆయనకు 70 ఏళ్లు.. ఆమెకు 19 ఏళ్లు.. పెళ్లి చేసేసుకున్నారు!
By: Tupaki Desk | 18 Nov 2022 11:30 AM GMTప్రేమ గుడ్డిదని అంటారు.. కానీ, తాజాగా వెలుగు చూసిన ఓ ఘటన.. ప్రేమ గుడ్డిదే కాదు.. అంతకుమించి అని నిరూపిస్తుండడం గమనార్హం. కారణం.. ప్రేమించుకున్న వారి వయసులో ఉన్న అంతరమే! వరసకు మనవరాలు అయ్యే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పోనీ.. ఆమె నేను ప్రేమిస్తున్నాను.. అని చెప్పి ఉండొచ్చు.
కానీ, ఆయనకు మాత్రం మైండ్ లేదా? ఈ వయసులో(70) ప్రేమలా? అందునా 19 ఏళ్ల కన్నెతో.. ప్రేమాయణమా? అని ఏమాత్రం ఆలోచించలేదు. ప్రేమంటే.. ఓకే అన్నాడు.. పెళ్లంటే.. సరే.. అన్నాడు!!
ఇదీ.. తాజాగా పాకిస్తాన్‌లో చోటు చేసుకున్న ఘటన. లాహోర్‌కు చెందిన లిఖత్ అలీ.. వయసు 70 ఏళ్లు. అంటే.. అన్నీ అయిపోయాయి. పిల్లలు.. వారికి పిల్లలు.. పెళ్లిళ్లు పేరంటాలు..అన్నీ అయిపోయాయి. ఇక, ఉన్నన్నాళ్లు ఉండి.. పోవడమే! అయితే.. ఈయనగారికి గొప్ప అలవాటు ఉంది. మార్నింగ్ వాక్ చేయడం.. ఆ సమయంలో ఆయన పాటలు పాడేవాడు. ఈ పాటలే.. ఆ యువతిని ఆకర్షించాయి. పెళ్లివరకు లాగేశాయి.
ఇంతకీ ఆమె ఎవరంటే.. లాహోర్‌కే చెందిన షమైలా.. వయసు పట్టుమని పందొమ్మిది. ఈమెకు పాటలంటే పిచ్చి. దీంతో మార్నింగ్ వాక్‌సమయంలో అలీ పాటలు విని.. మనసు పారేసుకుంది. మాటలు కలిపింది.. ప్రేమిస్తున్నానంది.. ఇది నిజానికి ఈ వయసులో(అంటే టీన్స్‌లో) సహజమే.
దీనినే ఆకర్షణ అంటారు కదా! ఇది మరి ఆ పెద్దాయనకు ఎందుకుతెలియలేదు? అనేది ప్రశ్న. ఇక, ఆ యువతి ప్రేమ అనగానే.. ఓకే అన్నాడు.కానీ, షమైలా కుటుంబం మాత్రం 'తాతతో పెళ్లేంటే..' అని పోరు పెట్టింది.
అయినా.. వింటేనా?(ఇదేనేమో ప్రేమ?) వెళ్లి పెళ్లి చేసుకుంది. ఇదీ.. కథ!! దీనిని స్వాగతించాలో.. లేదో.. జనం తేల్చుకోలేక పోవడం గమనార్హం. ఎందుకంటే.. మన దేశంలో మాదిరిగా కాకుండా.. పాకిస్థాన్‌లో యువతికి పెళ్లి వయసును అక్కడి ప్రభుత్వం 17 ఏళ్లుగా నిర్ణయించింది. దీని ప్రకారం షమైలా.. తనపెళ్లిని తన ఇష్ట ప్రకారం చేసుకునేందుకు చట్టం అనుమతిస్తుంది. కానీ,.. సమాజంలో రేపు ఎలా? అనేది ..ఒక్కనిముషం కూడా ఆలోచించకపోవడమే గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.