Begin typing your search above and press return to search.
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఈయనే!
By: Tupaki Desk | 11 Oct 2022 9:06 AM GMTభారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ యుయు లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో 74 రోజులు మాత్రమే ఆయన సీజేఐ పదవిలో కొనసాగినట్లవుతుంది. నవంబర్ 9 నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ బాధ్యతలు చేపడతారు.
ఈ మేరకు తదుపరి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంపికలో భాగంగా తదుపరి సీజేఐ పేరును ప్రతిపాదించాలని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత సీజేఐ జస్టిస్ యుయు లలిత్‌ను ఇటీవల కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చీఫ్ జస్టిస్ లలిత్‌కు కేంద్ర న్యాయ శాఖ లేఖ రాసింది. దీంతో ఆయన తన తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును కేంద్రానికి సిఫారసు చేశారు.
సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఉన్న వారిలో చీఫ్ జస్టిస్ యుయు లలిత్ తర్వాత డీవై చంద్రచూడ్ సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. దీంతో ఆయన పేరును తర్వాత ప్రధాన న్యాయమూర్తి పదవికి సూచిస్తూ కేంద్రానికి సిఫారసు చేశారు.
భారత ప్రధాన న్యాయమూర్తి సిఫార్సు చేసిన వారిని తదుపరి సీజేఐగా కేంద్రం ఖరారు చేయనుంది. ఈ ఏడాది ఆగస్టు 27న సీజేఐగా జస్టిస్ యూయూ లలిత్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తదుపరి సీజేఐ నియామక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కాగా తదుపరి సీజేఐగా బాధ్యతలు చేపట్టే జస్టిస్ చంద్రచూడ్ సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు సృష్టిస్తారు. ఇప్పటివరకు 48 మంది ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు. ప్రస్తుతం సీజేఐగా ఉన్న యుయు లలిత్ 49వ ప్రధాన న్యాయమూర్తి.
సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ డివై చంద్రచూడ్ పేరును సిఫార్సు చేశారు ప్రస్తుత సీజేఐ ఉదయ్ ఉమేష్ లలిత్. నవంబర్ 8న సీజేఐ లలిత్ పదవీ విరమణ చేయనున్నడంతో తన తదుపరి న్యాయమూర్తిగా సీనియర్ న్యాయమూర్తి అయిన చంద్రచూడ్ పేరును సిఫార్సు చేశారు. దీంతో జస్టిస్ డివై చంద్రచూడ్ దేశానికి 50 వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే ఆవకాశం ఉంది. నవంబర్ 10, 2024 వరకు రెండేళ్ల పాటు డీవై చంద్రచూడ్ పదవిలో ఉండబోతున్నారు.
కాగా ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ (డీవై చంద్రచూడ్) 1959లో జన్మించారు. ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ చదివారు. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి 1982లో లా పట్టా పొందారు. హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎంఎల్ చేశారు. జ్యుడీషియల్ సైన్స్‌లో డాక్టరేట్ కూడా సాధించారు. పలువురు ప్రముఖ న్యాయవాదుల వద్ద జూనియర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అలహాబాద్ హైకోర్టుకు 2013లో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. డీవై చంద్రచూడ్ తండ్రి వైవీ చంద్రచూడ్ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఇప్పుడు డీవై చంద్రచూడ్ కూడా సీజేఐగా బాధ్యతలు చేపడితే తండ్రీకుమారులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన రికార్డు సృష్టిస్తారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.