Begin typing your search above and press return to search.
భార్యను హత్య చేసి.. దృశ్యం సినిమాను దించేసిన భర్త..
By: Tupaki Desk | 14 Jan 2023 11:30 PM GMTదృశ్యం సినిమా అందరికీ తెలిసిందే. ఎన్ని భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేసినా, సూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో ఒక పోలీసు ఆఫీస్ కుమారుడిని హత్య చేసిన తర్వాత.. పోలీసు స్టేషన్‌లోనే పూడ్చి పెట్ట డం.. పెద్ద హైలెట్. ఇప్పుడు అచ్చం అలాంటి ఘటననే మక్కీకి మక్కీ దించేశాడు ఒక భర్త. భార్యను హతమార్చి అనంతరం ఇంటి ఆవరణలో పూడ్చి పెట్టాడు.
ఇలా ఒకటి కాదు.. రెండు నెలలు కాదు.. ఏకంగా ఏడాదిన్న అయింది. తర్వాత.. అనుమానంతో విచారణ చేయగా అసలు దృశ్యం వెలుగు చూసింది. కేరళలోని కొచ్చిలో జరిగిన ఈ దారుణం సంచలనం సృష్టించిం ది. నిందితుడు సంజీవ్.. 2021, ఆగస్టు 16న తన భార్య రమ్యను అనుమానంతో గొంతు కోసి చంపాడు. తర్వాత ఆమె శవాన్ని ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టాడు. అనంతరం ఏమీ తెలియనట్లుగా 2022 ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆగస్టు 2021 నుంచి తన భార్య కనిపించడం లేదంటూ వారికి చెప్పాడు. మొదటి నుంచి సంజీవ్పై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. అతనిపై ప్రత్యేక నిఘా ఉంచారు. సంవత్సరం పైగా ఈ కేసులో విచారణ జరిపి.. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే నిందితుడిని అరెస్ట్ చేశారు.
"2021, ఆగస్టులో భార్యభర్తలిద్దరికి ఫోన్ కాల్స్ విషయంలో గొడవ జరిగింది. తన భార్య ఎవరితోనో సంబంధం పెట్టుకుందని.. తాను లేనప్పుడు.. అతను ఇంటికి కూడా వస్తున్నాడని భార్యను అనుమానించాడు. దీనిపై ప్రశ్నించాడు .ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం జరిగి.. ఆవేశంలో భార్య రమ్యను హత్య చేశాడు. అనంతరం కొచ్చిలోని ఎడవనక్కడ్ గ్రామంలోని తన ఇంట్లోనే పూడ్చేశాడు." అని పోలీసులు తెలిపారు.
హత్య అనంతరం నిందితుడు.. తన భార్య రమ్య వేరే వ్యక్తి వెళ్లిపోయిందని బంధువులు, చుట్టుపక్కల వాళ్లను నమ్మించాడు. మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. మొత్తానికి పోలీసులు ఈ దృశ్యాన్ని బహిర్గతం చేయడంతో కేరళలోనే కాకుండా.. దక్షిణాదిలోనే సంచలన కేసుగా నమోదైంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.