Begin typing your search above and press return to search.
ఓటు కోసం పెళ్లినే వాయిదా వేసుకున్నాడు!
By: Tupaki Desk | 2 Dec 2022 9:54 AM GMTప్రస్తుతం గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మొదటి దశలో డిసెంబర్ 1న 89 స్థానాలకు పోలింగ్ జరిగింది. దాదాపు 60 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది.
డిసెంబర్ 5న రెండో విడత పోలింగ్ జరగనుంది. మిగిలిన 93 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు అధికారం దక్కించుకోవడానికి తీవ్ర స్థాయిలో పోటీపడుతున్నాయి.
కాగా గుజరాత్ ఎన్నికల్లో తన ఓటుహక్కు వినియోగించుకోవడానికి ప్రఫుల్‌భాయ్ మోర్ అనే వ్యక్తి తన వివాహ సమయాన్ని కూడా వాయిదా వేశాడు. ఓటు వేయడం కోసం మహారాష్ట్రలో జరగబోయే తన వివాహాన్ని తిరిగి షెడ్యూల్ చేసుకున్నానని తెలిపాడు.
గుజరాత్‌లోని తాపీలోని పోలింగ్ బూత్‌లో డిసెంబర్ 1 మధ్యాహ్నం 12.23 గంటలకు ప్రఫుల్‌భాయ్ మోర్ సంప్రదాయ కుర్తా పైజామా ధరించి, హల్దీ (పసుపు) పూసుకుని ఓటు వేయడం కోసం వచ్చాడు. తన పెళ్లి కోసం సాయంత్రం మహారాష్ట్ర వెళ్లాల్సి ఉందన్నారు. అయితే ఓటు వినియోగించుకోవడం తన పెళ్లిని వాయిదా వేసుకున్నానని తెలిపాడు.
ప్రతిఒక్కరూ ఓటు వేయాలని ప్రఫుల్‌భాయ్ మోర్ కోరాడు. "నేను ప్రతి ఒక్కరినీ ఓటు వేయమని కోరుతున్నాను, మీరు దానిని వృథా చేయవద్దు. నా పెళ్లి మహారాష్ట్రలో ఉదయం ఉంది. ఓటు కోసం దాన్ని నేను సాయంత్రానికి మార్చాను. దాని కోసం మేము మహారాష్ట్రకు వెళ్లాలి" అని ప్రుపుల్ బాయ్ తెలిపారు.
ఓటు వేయడానికి బద్దకించే సెలబ్రిటీలు, ప్రముఖులు, సామాన్యులు ఉన్న ఈ రోజుల్లో తన ఓటుహక్కును వినియోగించుకోవడానికి ఏకంగా తన పెళ్లినే వాయిదా వేసుకున్న ప్రుపుల్‌భాయ్‌పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల 2022 మొదటి దశలో కచ్, సౌరాష్ట్ర మరియు దక్షిణ గుజరాత్‌లోని 19 జిల్లాల్లోని 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 2,39,76,670 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలి దశలో బరిలో ఉన్న 788 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.