Begin typing your search above and press return to search.
నా ప్రేమను అమ్మకానికి పెట్టాడు.. ఇక జీవితంలో అలా చేయను: ఓ భార్య ఆవేదన
By: Tupaki Desk | 11 April 2021 11:30 PM GMTఇంట్లో వారి కోసం వంట చేయడంలో ఉండే ఆనందమే వేరు. తనవాళ్లు తృప్తిగా తినాలని ఆడవాళ్లు చాలా ఆరాటపడుతారు. ఇటీవల మగవాళ్లూ వంటింట్లోకి అప్పుడప్పుడు తొంగిచూస్తున్నారు. ఇక ఎంతకష్టమైనా రుచి, ఆరోగ్యం కోసం వంట చేసి బాక్స్ పెడతారు. అందరిలాగే ఆమె కూడా తన భర్తకు రోజూ వంట చేస్తూ బాక్సు కడుతుంది. ప్రేమతో వంట చేసే పంపిస్తుంది. అనుకోకుండా ఆమెకు ఓ రోజు షాకింగ్ నిజం తెలిసి నివ్వెరపోయింది.
ఆమె భర్తకు ఫాస్ట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో వండిన పదార్థాల కన్నా బయటే తినడానికి ఆసక్తి చూపుతాడు. కాగా తన భార్య ప్రేమతో పెడుతున్న ఆహారపదార్థాలను ఇతరులకు విక్రయించి తాను మాత్రం ఎంచక్కా ఫాస్ట్ ఫుడ్ తింటాడు. ఈ విషయం తెలిసి ఆ మహిళ చాలా ఆవేదన వ్యక్తం చేసింది. తన బాధను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది. బయటి తిండి మీద ఇష్టంతో తన భర్త రోజుకు 20 డాలర్ల చొప్పున నెలకు 600 డాలర్లు ఖర్చు చేస్తున్నాడని వాపోయింది. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నామని.. ఖర్చులు తగ్గించాలని ఎంత చెప్పినా ఆయనలో మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
ఫాస్ట్ ఫుడ్ తినడం మానేయమని ఎంతో చెప్పినా వినలేదని అంటోంది. భర్త కోసం శాండ్ విచ్ తయారు చేసి మరీ బాక్స్ కడుతున్నానని తెలిపింది. ఒకరోజు తన స్నేహితులు డిన్నర్ కి ఇంటికి వచ్చారని.. ఆ తరుణంలో తన వంటను మెచ్చుకున్నారని వెల్లడించింది. ఇదే సమయంలో తాను చేసే శాండ్ విచ్ లను తన భర్త విక్రయిస్తున్నాడని షాకింగ్ నిజాలు చెప్పినట్లు పేర్కొంది. దీనిపై భర్తని ప్రశ్నించగా శాండ్ విచ్ లు అమ్మి ఆ డబ్బుతో ఫాస్ట ఫుడ్ తింటున్నానని చెప్పినట్లు వివరించింది.
ఎంతో కష్టపడి ప్రేమగా తన భర్త కోసం వంట చేస్తే దానిని ఇలా అమ్మేయడం చాలా బాధ కలిగించిందని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రేమతో చేసిన వంటను ఇతరులకు విక్రయిస్తే తన ప్రేమను అమ్మినట్లేనని ఆమె వాపోయింది. ఇకపై భర్త కోసం ఎప్పుడూ వంట చేయకూడదని నిశ్చయించుకున్నానని తెలిపింది. నిజానికి ఆ మహిళ ఆవేదనలో అర్థం ఉంది. ప్రేమతో వండి పంపిన ఆహారాన్ని రోజూ అమ్మకానికి పెడితే ఆ బాధ ఇలాగే ఉంటది అని నెటిజన్లు అంటున్నారు.