Begin typing your search above and press return to search.
పాయింట్ బ్లాంక్ లో దేశ ఉపాధ్యక్షురాలిని కాల్చాడు.. కానీ ట్విస్ట్ ఇదే..
By: Tupaki Desk | 2 Sep 2022 1:31 PM GMTఅర్జెంటీనా ఉపాధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండేజ్ కు ఈ భూమిపై ఇంకా నూకలు ఉన్నాయి. ఆమెను పాయింట్ బ్లాంక్ లో తలకు గన్ పెట్టి ఓ దుండగుడు గన్ తో కాల్చాడు. కానీ బ్యాడ్ లక్ అందులోంచి తూటా బయటకు రాలేదు. వెంటనే తేరుకున్న పోలీసులు, పక్కనున్నవారు వాడిని పట్టుకున్నారు. అతి సమీపం నుంచి తుపాకీతో దాడి జరగడంతో అందరూ షాక్ తిన్న పరిస్థితి నెలకొంది.
అర్జెంటీనా ఉపాధ్యక్షురాలు క్రిస్టినా తనపై హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకుంది. ఓ దుండగుడు గన్ ఆమెకు గురిపెట్టి తలకు కాల్చే ప్రయత్నం చేశఆడు. అయితే అతి సమీపంగా జరిగిన ఈ దాడి యత్నంతో అంతా షాక్ తిన్నారు. ట్రిగ్గర్ నొక్కినా గన్ లోంచి బుల్లెట్ బయటకు రాకపోవడంతో ఆమె సురక్షితంగా దాడి నుంచి బయటపడింది.
ఆ వెంటనే తేరుకున్న పోలీసులు, సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం రాత్రి బ్యూనస్ ఎయిర్స్ ఇంటి వద్ద ఈ ఘటన జరిగినట్లు భద్రతా మంత్రి అనిబల్ ఫెర్నండేజ్ తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. చాలా చానెల్స్, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాయింట్ బ్లాంక్ నుంచి తుపాకీతో కాల్చినా ఆమె బతికి బట్టకట్టడం నిజంగా అదృష్టమని.. ఆమెకు భూమిపై ఇంకా నూకలు ఉన్నాయని అంటున్నారు.
మిలటరీ నియంతృత్వ పాలన నుంచి అర్జెంటీనా 1983లో స్వాతంత్ర్యం సంపాదించుకుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ దేశంలో ఇలాంటి తుపాకీ హత్యాయత్నాలు జరగలేదు. దాడికి యత్నించిన వ్యక్తిని బ్రెజిల్ వాసి ఫెర్నాండో ఆండ్రే సబాగ్ మోనటియల్ గా గుర్తించారు. అతడిపై ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని పోలీసులు ధ్రువీకరించారు.
ఇక హత్యాయత్నానికి గురైన క్రిస్టియానా ఫెర్నాండేజ్ డె కిర్చనర్ గతంలో రెండు సార్లు అర్జెంటీనా అధ్యక్షురాలిగా చేశారు. 2007-15 వరకూ కొనసాగారు. అయితే పబ్లిక్ కాంట్రాక్ట్ ల విషయంలో అవినీతి, అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటున్నారు ఆమె. ఇది రుజువైతే 12 ఏళ్ల జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.