Begin typing your search above and press return to search.
నక్సల్ అవ్వాలనుకుని పోలీసయ్యారట
By: Tupaki Desk | 14 Dec 2020 1:30 AM GMTడాక్టర్ అవ్వాలని అనుకుని యాక్ట్ అయ్యానని సినీ తారలు చెప్పే విషయాలు అందరికీ తెలిసిందే. కానీ ఓ పోలీసు అధికారి మాత్రం తాను నక్సలైట్ అవ్వాలని అనుకుని చివరకు పోలీసు అయినట్లు చెప్పారు. విశాఖ రేంజి డీఐజీ ఎల్కేవీ రంగారావు చేసిన ఈ వ్యాఖ్యలు పోలీసు శాఖలో సంచలనంగా మారాయి. మామూలుగా ఏ పోలీసు అధికారి కూడా ఇలాగ చెప్పారు. ఇంకేదో అవ్వాలని అనుకుని పోలీసు శాఖలో చేరినట్లు చెప్పటమే అందరికీ తెలిసిందే.
కానీ ఈ డీఐజీ మాత్రం తాను చిన్నపుడు నక్సైలట్ అవుదామని అనుకున్నారట. కృష్ణా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన తాను ఇంటర్మీడియట్ చదివేరోజుల్లో నక్సలైట్లలో చేరిపోదామని అనుకున్నారట. అందుకు సహకరించమని ఓ డాక్టర్ ను సంప్రదించారట. అయితే ఆ డాక్టర్ మాత్ర త ఆలోచనలు తప్పని వివరించి తన ఆలోచనను మార్చినట్లు గుర్తుచేసుకున్నారు.
మనదేశంలో డబ్బు, రాజకీయం, కులం, అవినీతి రాజ్యమేలుతున్నట్లు బాధపడిపోయారు. అవినీతే దేశానికి పట్టిన పెద్ద దరిద్రంగా అభివర్ణించటం ఆశ్చర్యంగా ఉంది. ఏ శాఖ పనితీరు ఎలాగున్నా పోలీసు వ్యవస్ధ మాత్రం నీతి, నిజాయితి, నిబద్ధతకు నిలువుటద్దంగా ఉండాలనే లక్ష్యంతోనే తాను పోలీసు శాఖలో చేరినట్లు చెప్పారు. అయితే తాను ఒకటనుకంటే ఆచరణలో మాత్రం జరుగుతున్నది మరొకటిగా వాపోయారు. అవినీతి రహిత సమాజం కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎంతగానో కృషి చేసినట్లు చెప్పారు. ఆయన ఆశయసాధనకోసం ప్రతి ఒక్కళ్ళు కష్టపడాలని పిలుపినిచ్చారు.