Begin typing your search above and press return to search.
28 ఏళ్లకు ఉరితీశారు.. 70 ఏళ్ల తర్వాత నిర్ధోషి అని తేలింది.. పోలీసుల సారీ
By: Tupaki Desk | 8 Sep 2022 11:44 AM GMTబ్రిటన్ దేశంలో జాత్యాహంకారం ఏ స్థాయిలో ఉంటుందోననడానికి ఈ కేసు గొప్ప ఉదాహరణగా చెప్పొచ్చు. 1952లో చేయని హత్యకు ఓ సోమాలి దేశానికి చెందిన మహమూద్ మట్టన్ ను పోలీసులు ఉరితీశారు.కనీసం విచారణ జరపకుండా చనిపోయిన బ్రిటీష్ మహిళ ఎలా చనిపోయిందని ఆధారాలు కూడా చూపకుండా మట్టన్ దోషి అంటూ పోలీసులు, కోర్టులు నిర్ణయించి ఉరితీశాయి. కానీ 70 ఏళ్ల తర్వాత వారి కుటుంబం మట్టన్ నిర్ధోషి అని నిరూపించాయి. దీంతో పోలీసులు ఆ కుటుంబానికి సారీ చెప్పాల్సి వచ్చింది. ఇందులో న్యాయవ్యవస్థ తప్పు కూడా ఉందని వివరించింది. కానీ ఇంత సారీ చెప్పినా అన్యాయంగా ఓ ప్రాణం బలిపోయిందంటే దానికి ఎవరు బాధ్యులంటే జవాబు దొరకని పరిస్తితి.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పొట్ట చేత పట్టుకొని మహమూద్ మట్టన్ సోమాలి దేశం నుంచి బ్రిటన్ లోని కార్డిఫ్ రేవుకు వలస వచ్చాడు. వేలాది మంది నావికులతో వచ్చి సౌత్ వేల్స్ లో స్థిరపడ్డాడు.అక్కడ లారా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ సోమాలి ప్రాంతం వారిని బ్రిటీషర్లు బందిపోటులుగా ట్రీట్ చేస్తారు. వారిని వెలివేస్తారు. కులాంతర వివాహం చేసుకున్నారని మట్టన్ కుటుంబాన్ని కూడా అలానే చేశారు. దీంతో పెళ్లి చేసుకున్నా కూడా మట్టన్ అతడి భార్య లారా వేరు వేరు ఇళ్లలో ఉంటూ బతుకీడ్చారు.
1952లో ఒక షాపులో లిల్లీ వాల్ పెర్ట్ అనే మహిళను హత్య చేశాడనే కారణంతో మహమూద్ మట్టన్ ను అరెస్ట్ చేశారు. అసలు ఈ హత్య చేయలేదని ఎంత గొంతు చించుకున్నా పోలీసులు వినలేదు. కోర్టు పట్టించుకోలేదు. అతడికి ఆరునెలల్లోనే ఉరితీశారు. కనీసం ఫోరెన్సిక్, సాక్ష్యులను కూడా విచారించకుండా కేవలం ఇతర దేశానికి చెందిన వాడని జాత్యాహంకారంతో ఉరితీశారు. స్థానిక బ్రిటీష్ వారు మట్టన్ హత్య చేశాడని ఆరోపించడాన్ని పరిగణలోకి తీసుకొని అతడిని ఉరితీశారు.
ఉరితీసిన విషయాన్ని కనీసం మట్టన్ కుటుంబానికి, భార్యకు తెలియజేయలేదు. అతడి శవాన్ని వారికి ఇవ్వలేదు పోలీసులు. భార్య జైలుకు వచ్చి చూసేసరికి మట్టన్ ను ఉరితీశారని తెలియడంతో ఆమె భోరుమన్నది. అప్పటి నుంచి తన ముగ్గురు కుమారులతో కలిసి మట్టన్ భార్య బ్రిటీష్ భార్య పోరాటం మొదలుపెట్టింది.
మొదట్లో ఈమెకు ఎవరూ సపోర్టు చేయలేదు. కొడుకులు పెద్దయ్యాక ఇప్పుడు వారు తమ తండ్రి తప్పు చేయలేదని పోరాటం మొదలుపెట్టారు. దీనికి మానవ హక్కుల సంఘాలు , ప్రముఖ మానవహక్కుల న్యాయవాది మైఖేల్ మాన్స్ ఫీల్డ్ ముందుకొచ్చాడు. వారి తరుఫున కోర్టులో వాదించారు. అప్పటి కేసును ఛేదించారు.
మట్టన్ హత్య చేశాడనుకుంటున్న మహిళ తనకు తానే మనస్థాపంతో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకుందని.. మానసిక సమస్యలతో ఇలా చేసిందని తేలింది.కానీ చేయని నేరానికి మట్టన్ ఈ కేసులో ఉరితీశారని తేలింది. దీంతో కోర్టు, పోలీసులు లెంపలేసుకున్నారు. మట్టన్ కుటుంబానికి సారీ చెప్పారు. ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
ఇలా తండ్రి చేయని నేరం కోసం గడిచిన 70 ఏళ్లుగా ఆ కొడుకులు పోరాడారు. చివరకు కొందరు చనిపోయారు కూడా.. బ్రిటన్ లాంటి జాత్యాహంకారంతో రగిలిపోయే మనుషులున్న దేశంలో మైనార్టీలకు న్యాయం ఎంత దుర్లభమో ఈ ఘటన కళ్లకు కడుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.