Begin typing your search above and press return to search.
సింధు విజయం వెనుక అతడిదే కీలకపాత్ర
By: Tupaki Desk | 2 Aug 2021 6:33 AM GMTస్వాతంత్య్ర భారతంలో ఎప్పుడూ లేని కొత్త రికార్డు నమోదైంది. ఇప్పటివరకు ఎప్పుడూ లేని రీతిలో ఒక క్రీడాకారుడు/ క్రీడాకారిణి వరుసగా రెండు ఒలింపిక్స్ లో పతకాలు సాధించింది లేదు. తొలిసారి ఆ రికార్డును సొంతం చేసుకోవటం మన తెలుగమ్మాయి సింధు సాధించింది. రియో ఒలింపిక్స ్లో రజతం పతకాన్ని సొంతం చేసుకోగా.. తాజా టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకోవటం ద్వారా అనూహ్య రికార్డును సొంతం చేసుకుంది.
మ్యాచ్ లో విన్నింగ్ పాయింట్ సాధించినంతనే.. సింధు సింహనాదం చేసింది. సెమీస్ లో ఎదురైన అనూహ్య ఓటమితో రగిలిపోతున్న ఆమె.. తనలోని కసిని విజయానంతరం స్పష్టంగా చూపించింది. సింధు విజయనాదాన్ని కెమేరాలు చూపించిన తర్వాత వెంటనే.. కెమేరాలన్ని కోర్టు బయట ఉన్న ఒక వైపుకు తిరిగాయి. అప్పటికే అక్కడున్న ఒక వ్యక్తి పట్టలేనంత ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నాడు.
కోర్టు నుంచి వేగంగా బయటకు వచ్చిన సింధు.. సదరు వ్యక్తి వద్దకు వచ్చి.. మనం సాధించామన్న అర్థం వచ్చేలా ఆత్మీయ ఆలింగనం చేసుకోవటం అందరిని ఆకర్షించింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు.. పార్క్ తే సంగ్. అతడే.. సింధు కోచ్. కొన్నేళ్ల కష్టానికి ప్రతిఫలంగా దక్కిన ఈ ఫలితాన్ని సొంతం చేసుకోవటంలో సింధు కోచ్ కీలకభూమిక పోషించారని చెప్పాలి.
అతగాడు 2019 నుంచి ఆమెకు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. సింధుకు తొలుత గోపీచంద్ కోచ్ గా ఉండేవారు. వారి మధ్య తేడాలు వచ్చిన తర్వాత ఆమె పార్క్ తే సంగ్ ను ఎంచుకున్నారు. ఆమె ఆటను గమనించిన అతడు.. డిఫెన్సెలో ఆమె బలహీనంగా ఉందని గుర్తించారు. ఆ లోపాన్ని అధిగమించేందుకు శిక్షణ ఇచ్చారు. కోర్టులో చురుగ్గా కదిలేలా శిక్షణ ఇచ్చారు. ఇంతకీ పార్క్ తే సంగ్ ఎవరు? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్ని చూస్తూ.. సింధుకు పతకం రావటం వెనుక అతడి శక్తిసామర్థ్యాలు ఏమిటన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.
- దక్షిణ కొరియా బ్యాడ్మింటన్ ఆటగాడు. 2004లో ఏథెన్స్ ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ లో క్వార్టర్స్ వరకు వెళ్లాడు. అదే ఏడాది ఆసియా చాంపియన్ షిప్ లో కాంస్యం గెలిచాడు.
- 2002 ఆసియా క్రీడల్లో పసిడి సాధించిన పురుషుల టీంలో అతనూ ఒక సభ్యుడు. తర్వాత కోచ్ గా అవతారం ఎత్తారు. వ్యూహాలు రచించటంలో అతడికున్న పట్టు అంతా ఇంతా కాదు.
- 2013 నుంచి 2018 వరకు కొరియా జట్టుకు కోచ్ గా పని చేశారు. తర్వాత భారత క్రీడా ప్రాధికార సంస్థకు అతడిని కోచ్ గా నియమించింది. ఆటపై గొప్ప అవగాహన ఉన్న అతడు.. సింధు ఆటను ఉత్తమంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్నారు.
- ఎప్పటికప్పుడు ఆమె ఆటలో మార్పులు తేవటం.. వెన్ను తట్టి ప్రోత్సహించాడు. ప్రత్యర్థుల ఆట తీరును పసిగట్టి.. పక్కా ప్లాన్ రూపొందించి సింధు విజయాల్లో కీలకంగా మారారు.
- సింధును రాటు దేలేందుకు వీలుగా కోర్టులో ఒకవైపు ఆమెను ఉంచి.. మరోవైపు ముగ్గురు లేదంటే నలుగురు కుర్రాళ్లను మరోవైపు ఉంచి.. ఆమెతో ఆడించేవారు. అంతేకాదు.. సింధును అయోమయానికి గురి చేసేలా వివిధ షాట్లు ఆడాలని చెప్పి మరీ ఆడించేవారు.
- నెట్ దగ్గర సమర్థంగా ఆడేలా శిక్షణ ఇచ్చాడు. దీనికి గచ్చిబౌలి స్టేడియంలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. సింధుకు శిక్షణ ఇచ్చేందుకు గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు తన కుటుంబాన్ని చూసేందుకు దక్షిణ కొరియాకు వెళ్లలేదు. అంతేకాదు.. తన నాలుగేళ్ల కుమార్తెను చూడకుండానే ఉండిపోయారు. అతడు పడిన కష్టానికి.. త్యాగానికి పతకం రూపంలో ఫలితం తగ్గింది. సింధు బ్యాడ్మింటన్ కోర్టులోవిజయం సాధిస్తే.. ఆమె వెనుక ఉన్న కోచ్ డబుల్ విజయాన్ని సాధించారని చెప్పాలి.