Begin typing your search above and press return to search.

వందల కోట్ల మందిని ప్రభావితం చేసిన అతడు ఇక లేరు

By:  Tupaki Desk   |   12 March 2021 3:30 PM GMT
వందల కోట్ల మందిని ప్రభావితం చేసిన అతడు ఇక లేరు
X
కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేటోళ్లు.. జనరల్ నాల్డెడ్జ్ట్ టన్నుల కొద్ది ఉన్న వారైతే ఫర్లేదు కానీ.. సామాన్యులకు పెద్దగా తెలియని పేరు ఓటెన్స్. సాంకేతికతను అందిపుచ్చుకొని.. దానితో ప్రయోజనం పొందినోళ్లుకోట్లాది మంది ఉన్నా.. అందుకు కారణమైన కొందరు పెద్దగా పాపులర్ కారు. ఆ కోవలోకే వస్తారు ఓటెన్స్. ఇంతకీ ఈ పెద్ద మనిషి ఎవరంటారా? ఆడియో క్యాసెట్స్.. ఇప్పటి తరానికి పెద్దగా తెలీదు కానీ.. అరవైల నుంచి మిలియం ముందు వరకు పుట్టిన ప్రతి ఒక్కరికి ఆడియో క్యాసెట్స్ తో అనుబంధం ఉంటుంది. కోరుకున్న పాటలు వినేందుకు క్యాసెట్స్ ఒక పెద్ద వరంగా ఉండేది.

దానికి ముందు పెద్ద పెద్ద గ్రామ్ ఫోన్ రికార్డులు ఉండేవి. వాటిని క్యారీ చేయటం చాలా కష్టంగా ఉండేది. ఖరీదు కూడా ఎక్కువే. ఆ ఇబ్బందిని తేలిగ్గా అధిగమించటంతోపాటు.. ఎక్కడి కంటే అక్కడకు తీసుకెళ్లేందుకు వీలుగా చిన్నపాటి క్యాసెట్లు వచ్చేశాయి. దాంతో.. కొన్ని దశాబ్దాల వారి వినోదానికి క్యాసెట్లే ఆధారం. దానిస్థానాన్ని భర్తీ చేస్తూ వచ్చిన సీడీల గురించి అందరికి తెలిసిందే. కొద్ది కాలంగా అవి మాయమవుతున్నా.. ఇప్పటి డిజిటల్ తరానికి సీడీల్ని ఇంకా మర్చిపోలేదు.

శాస్తసాంకేతిక రంగంలో.. అందునా ప్రతి ఒక్కరి దైనందిక జీవితానికి ఉపయోగపడే ఈ రెండింటిని అందించిన వ్యక్తే ఓటెన్స్. నెదర్లాండ్స్ కు చెందిన ఆయన తన 94వ ఏట కన్నుమూశారు. ఆయన మరణించి దాదాపు వారం కావొస్తుంది. కానీ.. ఆయన మరణ వార్త ప్రపంచానికి తెలియటానికి మాత్రం చాలా ఆలస్యమైందనే చెప్పాలి. అది కూడా బ్రిటిష్ మీడియా దిగ్గజం బీబీసీ పుణ్యమా అని ఆయన మరణవార్త బయటకు రావటం గమనార్హం. అయితే..ఆయన ఏ కారణంతో మరణించారన్న విషయం మాత్రం బయటకు రాలేదు.

1963లో ఓటెన్స్ ఆడియో క్యాసెట్ ను ప్రపంచానికి పరిచయం చేశాడు. అనంతరం సోనీ.. ఫిలిప్స సంస్థలతో ఒప్పందం చేసుకన్నారు. ఒక అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10వేల కోట్ల క్యాసెట్లు అమ్ముడైనట్లు చెబుతారు.ఆయన కనిపెట్టిన క్యాసెట్ల సాంకేతికత ఆధారంగానే సోనీ సంస్థ వాక్ మ్యాన్ ను తీసుకొచ్చింది. అంతలా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ప్రముఖుడి నిష్క్రమణ ప్రపంచంలోని చాలా మందికి తెలీకుండా జరిగిపోవటాన్ని ఏమనాలి?