Begin typing your search above and press return to search.

సిగ్గుప‌డ్తున్నాం​:​ ప్ర‌పంచ రాక్ష‌సుడు మ‌న‌వాడే

By:  Tupaki Desk   |   18 Dec 2015 6:39 AM GMT
సిగ్గుప‌డ్తున్నాం​:​ ప్ర‌పంచ రాక్ష‌సుడు మ‌న‌వాడే
X
ప్రపంచాన్ని వణికిస్తున్న తాజా ఉగ్రవాద సంస్థ ఐసిస్ అయిన‌ప్ప‌టికీ..ఈ కేటగిరీలో సీనియ‌ర్ మోస్ట్ అల్‌ ఖైదా. ఓ వ‌ర్గానికి చెందిన పౌరులు అత్య‌ధికంగా ఉన్న అల్‌ ఖైదాలో ఇపుడు భార‌త్ ప‌రువు తీసే సంఘ‌ట‌న జ‌రిగింది. ప్ర‌పంచం మొత్తం విస్త‌రించిన అల్‌ ఖైదా భారత ఉపఖండం అధిపతిగా ఉత్తరప్రదేశ్‌ కు చెందిన సనాకుల్‌ హక్‌ ను నియ‌మించింది. సనాకుల్‌ హక్‌ ను గత ఏడాదిలో భారత ఉపఖండానికి చీఫ్‌ గా ఆల్‌ ఖైదా అధిపతి అయమాన్‌ అల్‌ - జవహరి నియమించారు. ఈ విష‌యాన్ని పోలీసులు ధ్రువీక‌రించారు. యూపీ రాజధాని లక్నోకు 150 కిమీ దూరంలో ఉన్న సంభాహల్‌ గ్రామానికి చెందిన వాడని నిఘావర్గాలు నిర్థారించాయి. ఆల్‌ ఖైదాలో భారతీయులను చేర్పించడానికి ముఖ్యంగా రిక్రూట్‌ మెంట్‌ నెట్‌ వర్క్‌ పనులను హక్‌ పర్యవేక్షిస్తాడని వారు వివ‌రించారు.

ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు, భువనేశ్వర్‌ కటక్‌ కమిషనరేట్‌ పోలీసులు సంయుక్తంగా జగత్‌ పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పశ్చిమ కచ్చా గ్రామంలో రెహమాన్‌ ను పట్టుకున్నారు. మహ్మద్‌ అసిఫ్‌ - అబ్దుల్‌ రెహమాన్‌ లను విచారిస్తున్న సమయంలో హక్‌ వివరాలు లభించాయని సమాచారం. అసిఫ్‌ ను ఢిల్లీలో ఈనెల 14వ తేదీన అరెస్ట్‌ చేశారు. పోలీసులు అరెస్ట్‌ చేసిన రెహమాన్‌ ఇప్పటికే రెండు పీహెచ్‌ డీలను పూర్తి చేశాడు. మదర్సా నుంచి అరబిక్‌ - ఇస్లామిక్‌ స్టడీస్‌ ల్లో ఆయన పీహెచ్‌ డీలు పూర్తి చేశారు. హక్‌ కింద పని చేస్తున్న ఆపరేషనల్‌ డిప్యూటీ కూడా ఇండియన్‌ గా పోలీసులు గుర్తించారు. అతను కూడా సంబహల్‌ కు చెందిన వాడని అసిఫ్‌ పోలీసులకు వెల్లడించారు.

ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ కమిషనర్‌ అరవింద్‌ దీప్‌ వెల్లడించిన వివరాల ప్రకారం ఆసిఫ్‌ హక్‌ తో కలిసి పని చేశాడు. వారిద్దరు 2012లో ఇరాన్‌ నుంచి పాకిస్థాన్‌ కు మరో ఇద్దరు యూపీ వ్యక్తులతో కలిసి వెళ్లారు. ఉత్తర పాకిస్థాన్‌ లోని మిరాన్‌ షాహ్‌ జిహాదిస్ట్‌ క్యాంప్‌ వద్దకు రైల్లో వెళ్లారు. అక్కడ నుంచి భారత్‌ లో ఆల్‌ ఖైదా సభ్యులను చేర్చుకోవడానికి ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. అగ్రనేతల ఆదేశాల మేరకే ఆసిఫ్‌ ఇంటికి చేరాడు. అనారోగ్యం వల్ల ఆసిఫ్‌ ను 2014లో ఇంటికి పంపిన ఆయనకు భారతీయులను ఎక్కువ సంఖ్యలో ఆల్‌ ఖైదాలోకి చేర్చాలనే షరతు విధించింది. రెహమాన్‌ విషయానికి వస్తే ఒక్క ఒడిషా నుంచి ఒక్క వ్యక్తినైనా ఆల్‌ ఖైదా శిక్షణకు పంపాలన్న లక్ష్యంతో వచ్చారు. డియోబాండ్‌ లోని దార్‌ ఉల్‌ ఉలామ్‌ లో 1991లో చదువు పూర్తి చేశారు. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత జరిగిన గొడవల్లో పాల్గొని అరెస్టయ్యాడు. సంబ హాల్‌ నుంచి 1995 నుంచి కనిపించకుండా పోయాడు. కుటుంబసభ్యులతో మాత్రం ఇంకా సంబంధాలు కలిగి ఉన్నాడు.

ప్ర‌పంచవ్యాప్తంగా అరాచ‌కం సృష్టిస్తున్న ఈ ముఠాల్లో భార‌తీయులు ఉండ‌టం వారికి గ‌ర్వ‌కార‌ణం కావచ్చునేమో కానీ దేశానికి, ఇక్క‌డి పౌరుల‌కు అవ‌మాన‌క‌ర‌మే.