Begin typing your search above and press return to search.

మీకు రుచి ఇస్తుంది... పెళ్ళీ చేస్తుంది!!

By:  Tupaki Desk   |   30 Oct 2017 1:45 AM GMT
మీకు రుచి ఇస్తుంది... పెళ్ళీ చేస్తుంది!!
X
దాల్చిన చెక్క అనే దాన్ని మనం మామూలుగా బిరియానీలకు ఇంకొన్ని కూరలకు రుచి మరియు సువాసన ఇచ్చేందుకు వాడుతుంటాం. కానీ, దీని వల్ల మరో సరదా ఉపయోగం కూడా ఉంది. దీని వల్ల మీ పెళ్ళీ జరుగుతుంది. భలే ఉందిగా.. అవునండీ - డెన్మార్క్‌ లో 25 ఏళ్ళు దాటిన అమ్మాయి లేదా అబ్బాయికి ఇంకా పెళ్ళి జరగలేదంటే వారి ప్రతి పుట్టినరోజు నాడు వారి మీద దాల్చిన చెక్క పొడి చల్లుతారు. ఇక్కడ కూడా అదే ఆచారం ఉంటే డిక్టేటర్‌ సినిమాలో లాగా, నాకు నచ్చిన అమ్మాయిని నేను ఎన్నుకుని పెళ్లాడతాను అని ముసలాళ్ళు అయిపొయ్యే వాళ్ళు ఉండరు.

బిరియానీలకి వాడడం - పెళ్ళి చేయడం మాత్రమే కాదండోయి... దాల్చిన మీ ఆరోగ్యానికి కూడా ఉపయోగ పడుతుంది. కానీ ముందు దీని గురించి తెలుసుకుందాం..

దాల్చిన చెక్క మనకు తెలిసినంతవరకు దాల్చిన చెక్కే. కాని ఇది వేరు వేరు భాషలలో ఏమని పిలవబడుతుందో మనకి ఏమీ తెలీదు. దీనిని హిందీ - గుజరాతీ - మరాఠీ మరియు పంజాబీలో దాల్చిని అని అంటారు. దీనిని తమిళంలో పట్టయి - మలయాళంలో కరువపట్ట - కన్నడాలో లవణపట్టె మరియు బెంగాలీలో దార్కిని అని అంటారు. దాల్చిని వృక్ష జాతికి చెందిన సిన్నమోమం లోపలి బెరడు నుండి పొందిన సుగంధం. దీని బెరడు ఉత్పన్నమైన ఔషధాలకి ప్రసిద్ధి చెందింది. క్యాన్సర్‌ - ఫ్లూ మరియు అజీర్ణం వంటి ప్రధాన వ్యాధులను నయం చేసేందుకు ఆయుర్వేద మరియు చైనీస్‌ వైద్యాలలో శతాబ్దాలుగా మసాలాను ఉపయోగిస్తారు.

ఆరోగ్యాన్ని చూసుకుంటుంది :

1. దాల్చిని వల్ల గుల్లలు - మొటిమలు తొలగిపోతాయి.

2. దాల్చిని చనిపోయిన చర్మ కణాలను తీసివేయడానికి సహాయపడుతుంది.

3. ఇది కోతలు మరియు గాయాలు - చర్మ రోగాలకు కూడా మందు.

4. ఆది జుట్టుని నల్లపరుస్తుంది.

5. కొవ్వుని తగ్గిస్తుంది.

6. నొప్పిని తరిమేస్తుంది.

7. జలుబు - జ్వరం ఉంటే కూడా తగ్గిపోతాయి.

8. కీళ్ళ వాపు రాకుండా చేస్తుంది.

9. దాల్చిని బరువుని తగ్గించుకోవడంలో సహాయపడుతుంది.

10. క్యాన్సర్ను నిరోధిస్తుంది.

11. ఇది డయాబెటీస్‌ కి చికిత్స కూడా.

ఇవండీ - దాల్చిన విశేషాలు. ఇంకోటి - ఇదంతా చదివి మీకేమర్ధమైంది? మీకు ఇలాంటి సమస్యలు ఏవి వచ్చినా, బండేసుకోని ఆసుపత్రికి పోనక్కర్లేదు. ఇంట్లో దాల్చిన ఉంటే చాలు...!